fathers day నాన్నే.. నా రియల్ హీరో..
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:37 AM
నా తండ్రి నా ప్రత్యక్షదైవం, నా రియల్‌హీరో అంటూ ఎమ్యెల్యే పల్లె సింధూ రా రెడ్డి పేర్కొన్నారు. ఫాదర్స్‌డే సం దర్భంగా ఆదివారం ఆమె పట్టణంలోని నివాసంలో తన తండ్రి శంకర్‌రెడ్డికి పాదాభివందనం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

తండ్రికి ఫాదర్స్‌డే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్యెల్యే పల్లె సింధూరారెడ్డి
పుట్టపర్తి, జూన 16: నా తండ్రి నా ప్రత్యక్షదైవం, నా రియల్‌హీరో అంటూ ఎమ్యెల్యే పల్లె సింధూ రా రెడ్డి పేర్కొన్నారు. ఫాదర్స్‌డే సం దర్భంగా ఆదివారం ఆమె పట్టణంలోని నివాసంలో తన తండ్రి శంకర్‌రెడ్డికి పాదాభివందనం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మా ట్లాడుతూ.. తల్లి నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తే .. తండ్రి ఆ బిడ్డ చేయి పట్టుకుని ఉన్నత శిఖరాల వైపు నడిపించేందుకు జీవితాన్నే త్యాగం చేస్తారన్నారు. తండ్రికి ఎంత సేవ చేసినా రుణం తీరదన్నా రు. ఎంతపని ఒత్తిడిలో ఉన్నా.. నేను కనిపిస్తే ఆ ఒత్తిడి మాయమయ్యేదని నా తండ్రి తెలిపేవారన్నా రు. తన తండ్రి పోలీసువృత్తిలో నిత్యం ఒత్తిళ్లతో ఉన్నా నాఆశయాల కోసం నిరంతరం పరితపించారంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...