Share News

నమో నారసింహా..!

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:19 AM

కదిరి పౌర్ణమిని పురష్కరించుకొని నిర్వహిస్తున్న మండలంలోని సోమఘట్ట మధుగిరి లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవాన్ని అత్యంత వైభంంగా నిర్వహించారు.

నమో నారసింహా..!
సోమఘట్టలో భక్తుల మధ్య కదులుతున్న రథం

వైభవంగా మధుగిరి

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం

పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

చిలమత్తూరు, మార్చి 28: కదిరి పౌర్ణమిని పురష్కరించుకొని నిర్వహిస్తున్న మండలంలోని సోమఘట్ట మధుగిరి లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవాన్ని అత్యంత వైభంంగా నిర్వహించారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతుడైన నర సింహ స్వామికి సుప్రభాత సేవతో ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం స్వామి వారి బ్రహ్మరథాన్ని సిద్ధం చేయగా, ఆలయ అర్చకులు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ సేవకులు సంప్రదాయ మంగళవాయిద్యాలతో స్వామి వారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి తీసుకొచ్చారు. భక్తుల గోవింద నామ స్మరణ మధ్యన స్వామిని రథంపై ఆశీనులను చేశారు. దీంతో ఆల య ప్రాంగణమంతా నారసింహ నమోనమః అనే స్మరణ మోర్మోగింది. ముం దుగా నిర్ణయించిన ముహూర్త సమయానికి రథం ముందుకు కదిలింది. భక్తులు వెంట తెచ్చుకున్న ధవనం, అరటిపండ్లను రథంపైకి చల్లి మొక్కులు తీర్చుకున్నా రు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Updated Date - Mar 29 , 2024 | 12:19 AM