Share News

సమాన వేతనం ఇచ్చేదాకా సమ్మె

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:40 PM

సమాన పనికి సమాన వేతనం ఇచ్చేవరకు సమ్మె కొనసాగుతుందని మున్సిపల్‌ కార్మికులు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్‌ కార్మికులకు సంఘీభావం తెలిపారు.

సమాన వేతనం ఇచ్చేదాకా సమ్మె
కలెక్టరేట్‌ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్న ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌

స్పష్టం చేసిన మున్సిపల్‌ కార్మికులు

అనంతపురం క్రైం, జనవరి 8

సమాన పనికి సమాన వేతనం ఇచ్చేవరకు సమ్మె కొనసాగుతుందని మున్సిపల్‌ కార్మికులు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్‌ కార్మికులకు సంఘీభావం తెలిపారు. మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కార్మికుల డిమాండ్లను అంగీకరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమ్మె సోమవారానికి 14వ రోజుకు చేరుకుంది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకపోతే సమ్మె ఉధృతం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ హెచ్చరించారు.

Updated Date - Jan 08 , 2024 | 11:40 PM