Share News

CULTIVATION : ముంగారు సేద్యం పనులు ప్రారంభం

ABN , Publish Date - May 25 , 2024 | 12:07 AM

మండలంలో ఇటీవల కురిసిన తొలకరి వర్షాలకు రైతులు ముంగారు సేద్యం పనులు ప్రారంభించారు. వారం రోజుల కిందట వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షం కురిసింది. ఎండ తగ్గుముఖం పట్టి చల్లటి వాతావరణం నెలకొంది. దీంతో మండలంలోని రైతులందరూ కందిపంట సాగు కోసం పొలాలను దుక్కిదున్నే పనిలో నిమగ్నమయ్యారు. ట్రాక్టర్లతో సేద్యం పను లు విరివిగా సాగిస్తున్నారు. గతేడాది కొన్ని గ్రామాల్లో కంది పంట వదిగుబడి బాగా రావడంతో ఈ యేడాది మండలంలోని రైతులు అధికంగా కందిపంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు.

CULTIVATION : ముంగారు సేద్యం పనులు ప్రారంభం
A farmer doing irrigation work with a tractor in R Kottala

కంది సాగుపై రైతుల ఆసక్తి

కనుమరుగవుతున్న వేరుశనగ పంట

రొద్దం, మే 24 : మండలంలో ఇటీవల కురిసిన తొలకరి వర్షాలకు రైతులు ముంగారు సేద్యం పనులు ప్రారంభించారు. వారం రోజుల కిందట వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షం కురిసింది. ఎండ తగ్గుముఖం పట్టి చల్లటి వాతావరణం నెలకొంది. దీంతో మండలంలోని రైతులందరూ కందిపంట సాగు కోసం పొలాలను దుక్కిదున్నే పనిలో నిమగ్నమయ్యారు. ట్రాక్టర్లతో సేద్యం పను లు విరివిగా సాగిస్తున్నారు. గతేడాది కొన్ని గ్రామాల్లో కంది పంట వదిగుబడి బాగా రావడంతో ఈ యేడాది మండలంలోని రైతులు అధికంగా కందిపంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఆర్‌ మరువపల్లి, ఆర్‌ కొట్టాల, పెద్దగువ్వలపల్లి, చిన్నగువ్వలపల్లి, గోనిమేకలపల్లి, రెడ్డిపల్లి, వీఆర్‌ కొట్టాల తదితర గ్రామాల్లో ఒక్కో రైతు 40ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు కంది పంట సాగుచేస్తుంటారు. మరికొంతమంది రైతులు పొలాలను కౌలుకు తీసుకుని ఒక్కొక్కరు 40ఎకరాల దాకా పంట సాగుకోసం పోటీప డుతున్నారు. మరి కొంతమంది మడ కశిర వైపు వెళ్లి కౌలు కు తీసుకుని పంట సాగుచేస్తున్నారు. తక్కువ పెట్టుబడి అధిక ఆదాయం ఉండటం తో రైతులు కంది పంట సాగుకు ఇష్టప డుతున్నారు.


తగ్గిపోతున్న వేరుశనగ సాగు

మండలంలో 15ఏళ్ల కిందట వేరుశనగ పంటను వేలాది ఎకరాల్లో సాగుచేసే వారు. వర్షాభావ పరిస్థితులు, పంటకు చీడపీడలు ఆశించడం, దిగుబడులు రాకపోవడంతో వేరుశనగ సాగు క్రమంగా కనుమరుగవుతోంది. గతంలో ప్రభుత్వాలు సైతం రైతులకు సబ్సిడీ ధరలతో వేరుశనగ విత్తన కాయలు అందించడంతో పాటు పురుగుల మందు, ఇనపుట్‌ సబ్సిడీ, బీమా సౌకర్యం కల్పిం చేవి. ఆదిశగా రైతులందరూ వేరుశనగా సాగు చేసేవారు. అయితే పంట నష్టపో యిన రైతులను ఆదుకోవడంలో వైసీపీప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో మండలంలోని రైతులు వేరుశనగ సాగును పూర్తిగా మరిచిపోయి కందిపంట వైపు మొగ్గు చూపుతున్నారు.


కందివైపే రైతుల చూపు

మండలంలో రైతులు వేలాది ఎకరాలు కందిపంట సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఎకరంలో కందిపంట సాగుకు రూ.10వేలు మాత్రమే పెట్టుబడి వస్తుందని రైతులు అంటున్నారు. ఎకరం పొలం దున్నడానికి ట్రాక్టర్‌ బాడుగ ధర రూ.వెయ్యి పలుకుతోంది. కాడెద్దులతో సేద్యం చేసే రైతులు దాదాపుగా కనిపించడంలేదు. గత సంవత్సరం కంది పంట నష్టపోయిన రైతులకు ఇటీవల ప్రభుత్వం ఇన్సూరెన్స విడుదల చేసినప్పటికీ చాలా మందికి అందలేదని పలువురు అంటున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 25 , 2024 | 12:07 AM