Share News

చంద్రబాబు, లోకేశను కలిసిన ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:53 PM

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశను జిల్లా ఎమ్మెల్యేలు గురువారం కలిశారు. ఉండవల్లిలోని వారి నివాసంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వెంట సోదరి కిన్నెరశ్రీ ఉన్నారు.

చంద్రబాబు, లోకేశను కలిసిన ఎమ్మెల్యేలు
bandaru sravanisree with chandra babau

అనంతపురం అర్బన/గార్లదిన్నె/ మడకశిర టౌన/ పుట్టపర్తి : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశను జిల్లా ఎమ్మెల్యేలు గురువారం కలిశారు. ఉండవల్లిలోని వారి నివాసంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వెంట సోదరి కిన్నెరశ్రీ ఉన్నారు.

ఫ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశను విజయవాడలో ఆయన నివాసంలో దగ్గుపాటి ప్రసాద్‌ మర్యాద పూర్వకంగా కలిశారు.

ఫ నారాలోకేశను శుక్రవారం మడకశిర ఎమ్మెల్యే ఎంఎ్‌సరాజు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.

ఫ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబును ఎమ్మెల్యే పల్లె సింధూ రారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కేరళ రిటైర్డ్‌ డీజీపీ శంకర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్యెల్యేగా అవకాశం కల్పించడంపై చంద్రబాబుకు సింధూరారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 07 , 2024 | 11:53 PM