సోమనాథ్‌నగర్‌పై ఎమ్మెల్యే నిర్లక్ష్యం వీడాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:25 AM
స్థానిక సోమనా థ్‌నగర్ సమస్యలపై ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నిర్లక్ష్యం వీడాలని జనసేన పార్టీ రాయల సీమ రీజినల్ ఉమెన కో-ఆర్డి నేటర్ పెండ్యాల శ్రీలత మండిప డ్డారు.

అనంతపురం ప్రెస్‌క్లబ్, జనవరి 11: స్థానిక సోమనా థ్‌నగర్ సమస్యలపై ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నిర్లక్ష్యం వీడాలని జనసేన పార్టీ రాయల సీమ రీజినల్ ఉమెన కో-ఆర్డి నేటర్ పెండ్యాల శ్రీలత మండిప డ్డారు. గురువారం ఆమె ఆ పార్టీ నాయకులు, వీర మహిళలతో కలిసి సోమనాథ్‌నగర్‌లో పర్యటిం చారు. వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తీ కావస్తు న్నా.. సోమనాథ్‌నగర్‌లో చేపట్టిన అభివృద్ధి శూన్యమన్నారు. కాలనీలో రోడ్లు, మురుగు కాలువ నిర్మాణం జరగక స్థాని కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలువలు లేకపోవడంతో చిన్న పాటి వర్షానికే మురుగు నీరు ఇళ్లలోకి చేరుతోందని, దీంతో స్థానికులు వ్యాధుల బారిన పడా ల్సి వస్తోందని అన్నారు. గత సంవత్సరం కాలనీలో వరదలు వస్తే... రూ. 2 వేలు ఆర్థిక సా యం ఇస్తానన్న ఎమ్మెల్యే అనం త వెంకటరామిరెడ్డి ఇంత వర కూ ఆ సాయం అందించ కుం డా మోసం చేశారన్నారు. ప్రజ లందరూ గమనించి రానున్న వైసీపీని ఓడించి.. జనసేన, టీడీపీ ప్రభుత్వ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.