Share News

MLA jc asmith reddy విద్యుత అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

ABN , Publish Date - Aug 11 , 2024 | 01:00 AM

ట్రాన్సకోశాఖ పని తీరుపై ఎ మ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఆ శా ఖ అధికారులతో సమీక్ష జరిపారు. పట్టణంలోని తన నివాసంలో శనివారం ఆయన అధికారులతో సమావేశమై మాట్లాడారు. వ్యవసాయానికి అం దించే 9గంటల ఉచిత విద్యుత సరఫరాలో కోతలు లేకుండా చూడాలని, క్రమం తప్పకుండా విద్యుతను సరఫరా చేయాలని ఆదేశించారు.

MLA  jc asmith reddy విద్యుత అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి

తాడిపత్రి, ఆగస్టు 10: ట్రాన్సకోశాఖ పని తీరుపై ఎ మ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఆ శా ఖ అధికారులతో సమీక్ష జరిపారు. పట్టణంలోని తన నివాసంలో శనివారం ఆయన అధికారులతో సమావేశమై మాట్లాడారు. వ్యవసాయానికి అం దించే 9గంటల ఉచిత విద్యుత సరఫరాలో కోతలు లేకుండా చూడాలని, క్రమం తప్పకుండా విద్యుతను సరఫరా చేయాలని ఆదేశించారు.


విద్యుత కోతల వల్ల పట్టణ, మండలవ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు ఇబ్బందిపడతారని తెలిపారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విద్యుత కోతలు లేకుండా చూడాలన్నారు. యాడికి మండలంలోని గుడిపాడు వద్ద గల సాగర్‌ సిమెంట్స్‌ పరిశ్రమ వద్ద 132/33కేవీ సబ్‌స్టేషన ఇప్పటికే మంజూరుకాగా ఏర్పాటులో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫున డిపాజిట్‌ మొత్తం చెల్లించాల్సి ఉందని, అప్పుడే సబ్‌స్టేషన నిర్మాణం చేపట్టవచ్చునని అధికారులు సమాధానమిచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ సబ్‌స్టేషన నిర్మాణం జరిగితే యాడికి మండలంతో పాటు తాడిపత్రి మండలంలోని కొన్ని గ్రా మాల్లో విద్యుత కోతలు ఉండవన్నారు. తాడిపత్రి మండలంలోని చిన్నపొలమడ, పెద్దవడుగూరు మండలంలోని కిష్టిపాడు లేదా యాడికి మండలంలోని రాయలచెరువు వద్ద కూడా సబ్‌స్టేషన నిర్మాణం చేపడితే తాడిపత్రి మండలం, పెద్దపప్పూరు, యాడికి, పెద్దవడుగూరు మండలాలకు ఎంతో మేలు చేకూరుతుందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అలాగే పెన్నానదిలో ఏర్పాటుచేసిన విద్యుతస్తంభాలు నేలకొరగడంతో పట్టణంలోని శ్మశానం పక్కనగల సబ్‌స్టేషనలో ప్రస్తుతం విద్యుత సరఫరా ఆగిపోయిందని తెలిపారు. వీటిపై స్పందించిన ఎమ్మెల్యే ఉన్నతాధికారులతో మాట్లాడి పనులను మొదలుపెట్టిస్తానని పేర్కొన్నారు. సమావేశంలో గుత్తి డీఈ రాజశేఖర్‌, ఏడీలు రఘు, వసంతకుమార్‌, ఏఈలు ఉదయభాస్కర్‌, వీరాంజనేయరెడ్డి, సుదర్శనరెడ్డి, రాజారావు, మధుసూదనరెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Aug 11 , 2024 | 01:00 AM