Share News

నేడు మంత్రి సత్యకుమార్‌ ధర్మవరం రాక

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:48 PM

రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సొంత నియోజకవర్గం ధర్మవరానికి మంగళవారం రానున్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటి సారిగా నియోజకవర్గానికి రానుండటంతో కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది.

నేడు మంత్రి సత్యకుమార్‌ ధర్మవరం రాక

ఫ భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు

ధర్మవరం, జూన 17: రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సొంత నియోజకవర్గం ధర్మవరానికి మంగళవారం రానున్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటి సారిగా నియోజకవర్గానికి రానుండటంతో కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. తిరుమల దర్శనానంతరం సోమవారం రాత్రికి అనంతపురానికి చేరుకుంటారు. మంత్రితోపాటు టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌తో కలిసి వస్తుండటంతో ఈ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ఉదయం అనంతపురం నుంచి రోడ్డు మార్గాన బత్తలపల్లి మండలం యర్రాయపల్లి వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి భారీ ఎత్తున వాహనాల ర్యాలీతో బత్తలపల్లి మీదుగా ఽగొట్లూరుకు చేరుకుంటారు. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బైక్‌ ర్యాలీతో ధర్మవరం పట్టణంలోకి అడుగుపెడతారు. కదిరిగేటు వద్ద చేనేత విగ్రహానికి పూలమాల వేసి దిమ్మెలసెంటర్‌ మీదుగా, తేరుబజారు నుంచి దుర్గమ్మ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి కళాజ్యోతి సర్కిల్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి దుర్గానగర్‌ ఎదురుగా ఉన్న నూతనంగా నిర్మించిన ప్రభుత్వాస్పత్రి ఆవరణలో మంత్రి చేతులమీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతారు. అక్కడి నుంచి కూటమి కార్యాలయానికి చేరుకుంటారు. ఇందు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉదయం 9 గంటలకు గొట్లూరు గ్రామానికి చేరుకుని సత్యకుమార్‌, పరిటాలశ్రీరామ్‌లకు స్వాగతం పలికి అక్కడి నుంచి ఽధర్మవరంలోని కూటమి కార్యాలయం వద్దకు చేరుకునే వరకు ర్యాలీ కొనసాగుతుందని శ్రేణులు పేర్కొన్నాయి. కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు బైక్‌లలో వచ్చి ర్యాలీని జయప్రదం చేయాలని వారు కోరారు.

Updated Date - Jun 17 , 2024 | 11:48 PM