MID DAY MEALS: కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పునఃప్రారంభించాలి
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:30 AM
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం వెంటనే ప్రారంభించాలని ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఆర్‌ఐఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు.

అనంతపురం విద్య, జూలై 27: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం వెంటనే ప్రారంభించాలని ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఆర్‌ఐఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆ సంఘం జిల్లా కార్యదర్శి పరమేష్ మాట్లాడుతూ... కరువు జిల్లా అనంతపురం వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు చదువుతున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో అమలవుతున్న ఎండీఎంను రద్దు చేసిందన్నారు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు అర్ధాకలితో విద్యను అభ్యసించే పరిస్థితులు వచ్చాయరన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకోలేక చాలా మంది జూనియర్ కళాశాలలకు దూరమయ్యారని, అయినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా బాలికల కన్వీనర్ రజిత, జిల్లా ఉపాధ్యక్షులు గిరి, సిద్దు, జిల్లా సహాయ కార్యదర్శి సూర్యప్రకాష్, సోము, గణేష్, మహేష్, సాయి, వరుణ్, అరవింద్ పాల్గొన్నారు.