Share News

Mega Job Mela నేడు, రేపు మెగా జాబ్‌మేళా

ABN , Publish Date - Dec 13 , 2024 | 01:11 AM

నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఈ నెల 13, 14వ తేదీల్లో మెగా జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద గురువారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు.

Mega Job Mela నేడు, రేపు మెగా జాబ్‌మేళా

కళ్యాణదుర్గం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఈ నెల 13, 14వ తేదీల్లో మెగా జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద గురువారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు.


స్థానిక దొడగట్ట రోడ్డులో ఉన్న జ్ఞానభారతి పాఠశాలలో 200 కంపెనీ ప్రతినిధులతో ఈ మెగాజాబ్‌ మేళాను నిర్వహించనున్నామన్నారు. ఇప్పటికే సుమారు 8 వేల మంది నిరుద్యోగులు ఈ మెగాజాబ్‌ మేళాకు రిజిస్ర్టేషన చేయించుకున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో పర్యటించినప్పుడు ఇక్కడ యువత ఉద్యోగాలు లేక పడుతున్న కష్టాలు తాను గుర్తించానన్నారు. అందుకోసమే వారికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో మెగాజాబ్‌ మేళాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మరో రెండు నెలల్లో కూడా ఇలాగా మరో మెగాజాబ్‌ మేళాను నిర్వహిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు. మెగాజాబ్‌మేళాను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


మరిన్ని అనంతపురం వార్తలు...

Updated Date - Dec 13 , 2024 | 01:12 AM