shopping complex షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై సమావేశం
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:13 AM
పట్టణంలోని పోలీ్‌సస్టేషన పక్కన గల ఖా ళీ స్థలంలో షాపింగ్ కాంప్లె క్స్ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ చైర్మన జేసీ ప్ర భాకర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది.

తాడిపత్రి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పోలీ్‌సస్టేషన పక్కన గల ఖా ళీ స్థలంలో షాపింగ్ కాంప్లె క్స్ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ చైర్మన జేసీ ప్ర భాకర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్లూరు రోడ్డులో ఖాళీగా ఉన్న 4.25 సెంట్లు, పోలీ్‌సస్టేషన పక్కన ఉన్న 11.75 సెంట్లలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు. దీనికి సలహాలు, సూచనలు కావాలని ప్రజలను కోరారు. నాలుగు అంతస్తుల నిర్మా ణం చేపట్టనున్నట్లు తెలిపారు. గుడ్‌విల్, బాడుగ తదితర అంశాలపై చర్చించారు. కమిషనర్ శివరామకృష్ణ, మున్సిపల్ అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..