Share News

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:21 AM

ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో చిలమత్తూరు మండల వైసీపీ నాయకులు నాగరాజుయాదవ్‌, లక్ష్మీనారాయణయాదవ్‌, జడ్పీటీసీ అనూష, వైస్‌ ఎంపీపీ బయప్పతో పాటు వెయ్యి మం దికి పైగా టీడీపీలో చేరారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు
మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌తో కలిసి టీడీపీ కండువాలు కప్పుకున్న నాగరాజుయాదవ్‌, లక్ష్మీనారాయణ యాదవ్‌

నాగరాజు యాదవ్‌ సోదరులు, జడ్పీటీసీ

అనూషతోపాటు వెయ్యి మందికిపైగా...

కండువా కప్పి ఆహ్వానించిన బాలకృష్ణ

చిలమత్తూరు, ఏప్రిల్‌ 19: ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో చిలమత్తూరు మండల వైసీపీ నాయకులు నాగరాజుయాదవ్‌, లక్ష్మీనారాయణయాదవ్‌, జడ్పీటీసీ అనూష, వైస్‌ ఎంపీపీ బయప్పతో పాటు వెయ్యి మం దికి పైగా టీడీపీలో చేరారు. నామినేషన దాఖలు చేయ డానికి ఎమ్మెల్యే బాలకృష్ణ గురవారం హిందూపురం వ చ్చారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం చిలమత్తూ రులోని నాగరాజు యాదవ్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ నాగరాజు యాదవ్‌, లక్ష్మీనారాయణయాదవ్‌తో సంప్ర దింపులు జరిపి పార్టీలోకి అహ్వానించారు. వారితో పా టు వెయ్యిమందికిపైగా వైసీపీ శ్రేణులు టీడీపీలోకి చేరారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్సీ షేక్‌ మహ్మద్‌ ఇక్భాల్‌ బాలకృష్ణ వెంట ఉన్నారు. ఇక్బాల్‌ వర్గమంటూ వైసీపీ నాయకులు పక్కన పెట్టిన నాగరాజుయాదవ్‌ వర్గం మొత్తం బాలకృష్ణ సమక్షంలో టీడీపీలోకి చేరడం చిలమత్తూరు మండలంలో వైసీపీకి పెద్ద షాక్‌ అనే చెప్పవచ్చు. ఈ సందర్భంగా నాగరాజుయాదవ్‌, లక్ష్మీ నారాయణయాదవ్‌ మాట్లాడు తూ... ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యం లో నియోజకవర్గం బాగా అభివృద్ది చెందుతోందని, ఆయనను మరో సారి ఎమ్మెల్యేగా గెలిపించుకో వాల న్న ఉద్దేశ్యంతో తాము వైసీపీని వీడి టీడీపీలో చేరినట్లు తెలిపారు. ఇప్ప టికే వైసీపీలోని కొందరు నాయకుల వైఖరితో ప్రజలు విసుగుపోయారని, త్వరలో ఆ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో నంద మూరి బాలకృష్ణకు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుం టామన్నారు. వైస్‌ ఎంపీపీ బయప్ప మాట్లాడుతూ తాను వైస్‌ ఎంపీపీ అయినా కనీస మర్యాద, గౌరవం లేదన్నారు. వైసీపీలో కేవలం బీసీ జపం తప్ప, బీసీలకు న్యాయం జరగలేదన్నారు. దీంతో తాము టీడీపీలో చేరా మన్నారు. ముందుగా ఎమ్మెల్యే బాలకృష్ణ చిలమత్తూరుకు వస్తున్నారని సమాచారం రావడంతో వేలాది మంది జనం నాగరాజు యాదవ్‌ ఇంటి వద్ద వేచి ఉన్నారు. బాలకృష్ణ అక్కడికి చేరుకోగానే యాదవ్‌ సోదరులు గజ మాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ జైబాలయ్య, జై టీడీపీ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడున్న ప్రజలకు ఆయన అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, బేవనహళ్లి ఆనంద్‌, నాగరాజు, రంగారెడ్డి, మహమ్మద్‌ గౌస్‌, సోమశేఖర్‌, బేకరీ గంగాధర్‌ తదితరలు ఉన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:21 AM