Share News

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:43 PM

పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత గత ఎనిమిదేళ్ల నుంచి చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరామని పలువురు పేర్కొన్నారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు
పెనుకొండలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సవిత

పెనుకొండ టౌన, మార్చి 18 : పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత గత ఎనిమిదేళ్ల నుంచి చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరామని పలువురు పేర్కొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం సవిత సమక్షంలో వంద మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పెనుకొండ మండలంలోని మావటూరు నుంచి 60కుటుంబాలు, రొద్దం మండలం చెరుకూరు నుంచి 16, పరిగి మండలం వంగంపల్లి, ఎస్సీ కాలనీ నుంచి పలు కుటుంబాలు పార్టీలోకి చే రాయి. వారికి సవిత పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ... తాను అందరికీ అందబాటులో ఉంటానని ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. వచ్చేది టీడీ పీ ప్రభుత్వమేనని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు పూర్తి అభివృద్ధి చేస్తామని తెలిపారు. చంద్రబాబు ఇటీవల విడుదల చేసిన సూపర్‌ సిక్స్‌ పథ కాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల మాజీ కన్వీనర్‌ శ్రీరాములు, నాయకులు మాధవనాయుడు, త్రివేంద్ర, బాబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సవితను కలిసిన కాంగ్రెస్‌ నాయకుడు : మండలంలోని కసిరెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజారెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితను పెనుకొండలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె టీడీపీలో చేరాలని కోరగా అందుకు ఆయన సంసిద్దత వ్యక్తం చేశారు. పార్టీ మార్పు లోచ నపై రాజారెడ్డిని వివరణ కోరగా.. చంద్రబాబు నాయకత్వంపై ఉన్న నమ్మకం, టీడీపీ ద్వారా ప్రజలకు సేవ చేయవచ్చన్న ఉద్దేశ్యంతో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Updated Date - Mar 18 , 2024 | 11:43 PM