Share News

శంఖారావం సభకు భారీ ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:03 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపట్టిన శంఖారావం కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం పెనుకొండలో నిర్వహిస్తు న్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు.

శంఖారావం సభకు భారీ ఏర్పాట్లు
శంఖారావం ఏర్పాట్లను పరిశీలిస్తున్న సవిత

పెనుకొండ టౌన, మార్చి 5 : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపట్టిన శంఖారావం కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం పెనుకొండలో నిర్వహిస్తు న్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె మంగళవారం స్థానిక నాయకులతో కలిసి శంఖారావం ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ...శంఖారావంలో భాగంగా నారా లోకేశ వైసీపీ అరాచకాలు, జగన పాలనా వైఫల్యాలు, ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల దోపిడీలు, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడం, వేధించడం లాంటి అంశాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతారన్నారు. జగన పాలనలో నష్టపోయిన వివిధ వర్గాలను కలిసి వారికి భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రఘువీరచౌదరి, గోరంట్ల నాయకులు బాలకృష్ణ చౌదరి, ఉత్తంరెడ్డి, రవీంద్రనాయక్‌, మాజీ మండల కన్వీనర్‌ శ్రీరాములు, బాబుల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రా కదిలిరా సభ విజయవంతంపై కృతజ్ఞతలు

అధికార పార్టీ వైసీపీకి వణుకు పుట్టే తరహాలో టీడీపీ అధినేత రా కదిలిరా బహిరంగ సభ పెనుకొండలో ఘనంగా సాగిందని పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత అన్నారు. ఆమె మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో సమావేశం ఏర్పాటుచేశారు. చంద్రబా బు సభను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాసులు, వెంకటరమణ, పాలడుగు చంద్ర, మావటూరు గోపాల్‌, త్రివేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కండువాల కథను ఎవరూ నమ్మరు : సవిత

ఇతర ప్రాంతాలవాసులకు కండువాలువేసి వైసీపీలో జోష్‌ పెరిగిందని ఆర్భాటాలు పలుకుతున్న మంత్రి కండువాల కహానీని నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత అన్నారు. ఆమె మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేక రులతో మాట్లాడుతూ.... మంత్రి ఉష వైసీపీ నాయకులకే కండువాలు వే స్తున్నారని విమర్శించారు. అలాగే పోలీసులు, వలంటీర్లను అడ్డుపెట్టుకుని బె దిరింపులతో మంత్రి సమక్షంలో చేరికలు చేస్తున్నారన్నారు. పైగా మంత్రి వద్ద కు సమస్యల కోసం వెళ్లే వారికి కూడా కండువాలు వేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారన్నారు. ఇందుకు వలంటీర్లను వాడుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం వస్తే వలంటీర్లకు నజరానాతో పాటు ఇంటిపట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే అంటున్నారని, ఇదే ఎమ్మెల్యే కళ్యాణదుర్గంలో వలంటీర్లకు ఏమి ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. స్థానిక వలంటీర్లు కూడా ఆలోచించాలన్నారు. వలంటీర్లపై ఒత్తిడి తెస్తుంటే చేసేదేమీలేక వారు మంత్రి సమక్షంలో పలువురికి కండువాలు వేయిస్తున్నారని అన్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ గెలుపును ఆపేది ఎవరితరం కాదన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:03 AM