కేంద్ర బలగాల కవాతు
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:19 AM
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో గురువారం బీఎ్‌సఎఫ్ బలగాలు కవాతు నిర్వహించాయి.
ఉరవకొండ, మార్చి 7: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో గురువారం బీఎ్‌సఎఫ్ బలగాలు కవాతు నిర్వహించాయి. స్థానిక పోలీసు స్టేషన నుంచి టవర్ క్లాక్ వరకూ కవాతు చేపట్టారు. నియోజక వర్గానికి 95 మంది సిబ్బంది కేటాయించారని సీఐలు సురేష్, ప్రవీణ్ కుమార్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.
తాడిపత్రిటౌన: ఎన్నికల దృష్ట్యా పట్టణంలో గురువారం పోలీసులు కవాతు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారి సీబీరోడ్డు, గాంధీసర్కిల్, యల్లనూరురోడ్డు, బస్టాండ్‌సర్కిల్ మీదుగా కవాతు జరిగింది. డీఎస్పీ గంగయ్య మాట్లాడుతూ ప్రజలు తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవచ్చునన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని ఎవరూ భయపడా ల్సిన పనిలేదని తెలిపారు. కవాతులో సీఐలు మురళీకృష్ణ, లక్ష్మికాంతరెడ్డి, ఎస్‌ఐ లు రామకృష్ణ, గౌస్‌బాషా, సాగర్, ఏఎ్‌సఐలు, బీఎ్‌సఎఫ్ బలగాలు పాల్గొన్నాయి.