పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:56 PM
పిచ్చికుక్క దాడిలో పలువురు గాయపడ్డారు. రొళ్ళ మండలంలోని వట్టెబెట్ట గ్రామంలో పిచ్చికుక్క రెండు రోజులనుంచి స్వైరవిహారం చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

మడకశిర, జూలై 5: పిచ్చికుక్క దాడిలో పలువురు గాయపడ్డారు. రొళ్ళ మండలంలోని వట్టెబెట్ట గ్రామంలో పిచ్చికుక్క రెండు రోజులనుంచి స్వైరవిహారం చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం రాత్రి బాలురు రోహిత, దిలీప్, మహిళ సునంద పిచ్చికుక్క దాడిలో గాయపడ్డారు. కాళ్లు చేతులపై గాట్లు పడ్డాయి. గాయ పడిన వారు మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల నుంచి పిచ్చి కుక్క దాడి లో ఐదు మంది దాకా గాయపడినట్లు బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలను కాపాడాలని వేడుకుంటున్నారు.