electric shock: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:46 PM
మండలంలోని డీ.కొండాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఆంజనేయులు(48) సోమవారం మృతి చెందాడు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు ఆంజనేయులు వ్యవసాయ కూలి పని చేస్తూ, ప్రతి ఆదివారం చికెనకొట్టును నడుపుతూ జీవించేవాడు. ఆదివారం ఉదయం తనకున్న ఐదు గొర్రె పిల్లలకు పచ్చిగడ్డి తీసుకువస్తానని చెప్పి ఒక రైతు పొలంలోకి వెళ్లాడు.

రాయదుర్గంరూరల్, జూన 17: మండలంలోని డీ.కొండాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఆంజనేయులు(48) సోమవారం మృతి చెందాడు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు ఆంజనేయులు వ్యవసాయ కూలి పని చేస్తూ, ప్రతి ఆదివారం చికెనకొట్టును నడుపుతూ జీవించేవాడు. ఆదివారం ఉదయం తనకున్న ఐదు గొర్రె పిల్లలకు పచ్చిగడ్డి తీసుకువస్తానని చెప్పి ఒక రైతు పొలంలోకి వెళ్లాడు. అక్కడ గడ్డి కోస్తుండగా కింద పడిన విద్యుత వైర్లు చేతికి తగలడంతో విద్యుతషాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. కూలి పనులకు వెళ్లిన భార్య సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి భర్త కోసం వెతికింది. కనిపించకపోవడంతో స్థానికుల సహాయంతో చుట్టుపట్ల గాలించింది. చివరకు రాత్రి ఏడు గంటల సమయంలో రైతు తోటకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.