కనీస సౌకర్యాల్లేని మలకవారిపల్లి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:36 PM
మండలంలోని మలకవారిపల్లిలో కనీస సౌకర్యాలు లేక ఆ గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి వెళ్లడానికి సరైన రోడ్డూ లేదు. గ్రామంలో తాగునీటి సౌకర్యమూ లేదు.

నల్లచెరువు, జూలై 5 : మండలంలోని మలకవారిపల్లిలో కనీస సౌకర్యాలు లేక ఆ గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి వెళ్లడానికి సరైన రోడ్డూ లేదు. గ్రామంలో తాగునీటి సౌకర్యమూ లేదు. గత ఐదేళ్లలో గ్రామంలో ఏ ఒక్క పక్కాగృహం మంజూరు కాలేదు. గ్రామంలో 30 కుటుం బాలు ఉన్నారు. అందరూ కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారే. మండల కేంద్రా నికి 14 కిలోమీటర్ల దూరంలో.. మండలం సరిహద్దులో ఈ గ్రామముంది. మలకవారి పల్లి గ్రామానికి పక్కన గాండ్ల పెంట మండ లంలోని సామచేనుబైలు గ్రా మం ఉంది. మండల కేంద్రానికి చివర ఉండడమే ఈ గ్రామానికి శాపంగా మారింది.
అందువల్లే కనీ స సౌకర్యాలకు దూరమవు తున్నామని ఆ గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలో 15 మంది చిన్నారులున్నారని, గ్రామంలో అంగన వాడీ కేంద్రం లేకపోవడంతో పక్క మండ లంలో కిలోమీటరు దూరంలోని సామచేను బైలుకు పంపుతున్నామని అన్నారు. గత టీడీ పీ పాలనలో గ్రామానికి సీసీ రోడ్డు వేశారని, తాగునీటి పథకం ద్వారా ట్యాంక్ ఏర్పాటు చేశారని అన్నారు. అయితే తాగునీటి పథకం బోరు చెడిపోవడంతో గత వైసీపీ పాలకులు ఏ మాత్రం పట్టిం చుకోలేదన్నారు. దీంతో నీటి ట్యాంక్, కొళాయిలు కూడా ధ్వంసమయ్యాయ న్నారు. ప్రస్తు తం తాగునీటి బోరులో నీరు పుష్కలంగా ఉన్నా.. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. తాగునీటి సమస్యపై పలుమార్లు గ్రామస్థులంతా మం డల కేంద్రానికి వచ్చి ఎంపీడీఓ దృష్టికి తీసుకె ళ్లామని, ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశా మని, అయినా అధికారులు ఏ మాత్రం పట్టిం చుకోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికా రులు తమ గ్రామంలోని సమస్యలు పరిష్క రించాలని ఆ గ్రామస్థులు కౌసల్య, ఆదినారా యణ, రామ క్రిష్ణ, వెంకటరమణ, గోవిందు, నాగరాజు, రాజేశ్వరీ విజ్ఞప్తి చేస్తున్నారు.