Share News

శంఖారావం సభను విజయవంతం చేయండి

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:05 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ గురువారం మడకశిర నియోజకవర్గంలో శంఖారావం సభ నిర్వ హిస్తా రని, వర్గ విభేదాలు వీడి కార్యక్రమం విజయవంతం చేయాలని టీడీపీ మడకశి ర నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ అన్నారు.

శంఖారావం సభను విజయవంతం చేయండి
విలేకరులతో మాట్లాడుతున్న డాక్టర్‌ సునీల్‌కుమార్‌

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌

మడకశిర టౌన, మార్చి 5 : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ గురువారం మడకశిర నియోజకవర్గంలో శంఖారావం సభ నిర్వ హిస్తా రని, వర్గ విభేదాలు వీడి కార్యక్రమం విజయవంతం చేయాలని టీడీపీ మడకశి ర నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ అన్నారు. ఆయన మంగళ వారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న, టీడీపీ నాయకులతో కలసి పట్టణ సమీపంలోని చీపులేటి వద్ద సభా స్థలం పరిశీలించారు. అనం తరం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శంఖా రావం కార్యక్రమంలో భాగంగా నారా లోకేశ గురువారం మఽఽధ్యాహ్నం 12 గంటలకు మడకశిర చేరుకుంటారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్ర మాలు, దౌర్జన్యాలు, అవినీతిని ఎండగట్టాలన్నారు. అలాగే పేదలకు మంచి పరి పాలన అందించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అందరూ సమష్టిగా కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు. అనంతరం లోకేశ పర్యటనను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. నియోజకవర్గంలోని టీడీపీ బూత కమిటీ సభ్యలు, నాయకులు, కార్యకర్తలు అందరూ హజరై శంఖారావం కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఈ సందర్భంగా నాయకులు కిష్టప్ప, రాజగోపాల్‌, ఈశ్వర్‌సాగర్‌, నరేసేగౌడ్‌, మంజునాథ్‌ తదితరులు ఉన్నారు.

రొళ్ల: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ గురువారం మధ్యాహ్నం మడకశిర సమీపంలోని చీపులేటి వద్ద నిర్వహిస్తున్న శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా కార్యదర్శి రవిభూషణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.

అగళి : మడశరి పట్టణ సమీపంలోని చీపులేటి వద్ద జరిగే తెలుగుదేశం పార్టీ శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎంపీపీ రామక్రిష్ణ, నాయకులు అలీఖాన, శివలింగప్ప, నాగోజీ, దినేష్‌, క్యాతప్ప, తదితరులు కోరారు. నారా లోకేశ పాల్గొనే ఈ కార్యక్రమానికి మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు.

Updated Date - Mar 06 , 2024 | 12:05 AM