Share News

కళ్యాణదుర్గానికి మహర్దశ రానుంది

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:32 AM

అస్తవ్యస్తంగా మారిన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మహర్దశ రానుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు.

కళ్యాణదుర్గానికి మహర్దశ రానుంది
ఓటరుకు నమస్కరిస్తున్న అమిలినేని సురేంద్రబాబు

కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని

కళ్యాణదుర్గం, ఏప్రిల్‌ 19 : అస్తవ్యస్తంగా మారిన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మహర్దశ రానుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శుక్రవారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 15వ వార్డు బోయవీధి, 16వ వార్డు చౌడమ్మగుడి వీధి, 17వ వార్డు బావి బసవేశ్వరస్వామి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అమిలినేనికి ఆయ కాలనీవాసులు పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్‌షో, ర్యాలీలో పాల్గొన్నారు. అమిలినేని మాట్లాడుతూ పట్టణ ప్రజల నుంచి పన్నులు కట్టించుకుంటున్నారే తప్ప వారికి అవసరమైన డ్రైనేజీలను ఏర్పాటు చేయకపోవడం, ఉన్న వాటిని శుభ్రం చేయకపోవడం దారుణమన్నారు. మురుగునీటితో దుర్వాసన వెదజల్లుతున్నా మున్సిపల్‌ అధికారులు, ప్రభుత్వం స్పందించలేదన్నారు. మున్సిపాల్టీకి ప్రజలు కట్టిన పన్నులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ప్రజలు కట్టిన పన్నులు మున్సిపాలిటీకి కాకుండా తాడేపల్లిప్యాలె్‌సకు వెళ్లాయనే అనుమానాలు వస్తున్నాయన్నారు. మరో రెండు నెలల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేసుకుని మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు వేసి డ్రైనేజీలు, సీసీ రోడ్లు వేసుకుని పట్టణ ప్రజలు కట్టిన పన్నులకు న్యాయం చేస్తామన్నారు. అలాగే కళ్యాణదుర్గంను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంటామన్నారు. మే 13న జరిగే పోలింగ్‌లో టీడీపీని ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మసముద్రం మండలంలో వైసీపీకి షాక్‌

బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర గ్రామ ఎంపీటీసీ మారుతమ్మ, ఆమె భర్త అంజి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అమిలినేని సురేంద్రబాబు టీడీపీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే పాలవెంకటాపురం పంచాయతీ ఎర్ర కొండాపురం గ్రామ వైసీపీకి చెందిన ఎనిమిది కుటుంబాలు టీడీపీలోకి చేరాయి.

Updated Date - Apr 20 , 2024 | 12:32 AM