Share News

divotional త్రిలింగేశ్వరాలయంలో మహాచండీయాగం

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:26 AM

పట్టణంలోని తేరుబజారులో గల త్రిలింగేశ్వరాలయంలో గురువారం అమావాస్యను పురస్కరించుకుని మహాచండీయాగం నిర్వహించారు.

divotional త్రిలింగేశ్వరాలయంలో మహాచండీయాగం
మహాచండీయాగాన్ని నిర్వహిస్తున్న వేదపండితులు

ధర్మవరం రూరల్‌, జూన6: పట్టణంలోని తేరుబజారులో గల త్రిలింగేశ్వరాలయంలో గురువారం అమావాస్యను పురస్కరించుకుని మహాచండీయాగం నిర్వహించారు.


అర్చకుడు రాఘవశర్మ ముందుగా స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేశారు. అనంతరం విశేష పూజలుపూజలు గావించారు. తర్వాత వేదపండితుల ఆధ్వర్యంలో మహాచండీయాగం చేశారు. ప్రజలంతా ఆయురోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని ఈ యాగం చేసినట్లు అర్చకుడు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ పాటు అన్నదానం చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 07 , 2024 | 12:26 AM