Share News

ప్రచార శబ్దానికి పరిమితులు

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:55 PM

కేంద్ర ఎన్నికల సంఘం పరిమితుల మేరకే అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించాలి. ఎన్నికల ప్రచారంలో పర్యావరణ చట్టాలు, నిబంధనలను నేతలం తా పాటించాలి. మైకుల శబ్దాలతో హోరెత్తిస్తే చర్యలు తప్పవు. డీజేసౌండ్స్‌ పెద్ద పెద్ద స్పీకర్లతో గోల చేస్తే శబ్దకాలుష్యం కింద కేసులు పెడతామని అధికారులు చెబుతున్నారు.

ప్రచార శబ్దానికి పరిమితులు

ధర్మవరం, ఏప్రిల్‌ 24: కేంద్ర ఎన్నికల సంఘం పరిమితుల మేరకే అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించాలి. ఎన్నికల ప్రచారంలో పర్యావరణ చట్టాలు, నిబంధనలను నేతలం తా పాటించాలి. మైకుల శబ్దాలతో హోరెత్తిస్తే చర్యలు తప్పవు. డీజేసౌండ్స్‌ పెద్ద పెద్ద స్పీకర్లతో గోల చేస్తే శబ్దకాలుష్యం కింద కేసులు పెడతామని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఏయే ప్రాంతంలో ఎంత శబ్దం అనుమతి స్తారనే వివరాలు ఇలా ఉన్నాయి. ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు జైలు శిక్ష పడే అవకాశముంది. ఆయాప్రాంతాల్లో ఉండాల్సిన శబ్ద తీవ్రత నివాస ప్రాంతాల్లో 45 నుంచి 55 డెసిబుల్స్‌, వైద్యశాలలు, విద్యాలయాలు, న్యాయస్థానాల సమీపంలో 40 నుంచి 50 డెసిబుల్స్‌, వ్యాపార ప్రాంతాల్లో 55 నుంచి 65 డెసిబుల్స్‌, పారిశ్రామిక ప్రాంతాల్లో 70 నుంచి 75 డెసిబుల్స్‌ మించి శబ్దం చేయరాదు.

Updated Date - Apr 24 , 2024 | 11:55 PM