సస్పెన్షన్లు ఎత్తివేయండి
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:56 PM
ఎన్నికల నేపఽథ్యంలో పలు కారణాలతో ఉద్యోగ, ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని, ఆ సస్పెన్షన్లను ఎత్తి వేయాలని ఆయా సంఘాల నేతలు కోరారు. శుక్రవారం ఏపీఎ్‌సఈ, ఆపస్, ఎస్‌ఎల్‌టీఏ, డీటీడబ్ల్యూ సంఘాల నాయకులు కలెక్టర్‌ను కలిసి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించినందుకు అభినందించారు.

ఫ కలెక్టర్‌ను కోరిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు
అనంతపురం టౌన, జూన7: ఎన్నికల నేపఽథ్యంలో పలు కారణాలతో ఉద్యోగ, ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని, ఆ సస్పెన్షన్లను ఎత్తి వేయాలని ఆయా సంఘాల నేతలు కోరారు. శుక్రవారం ఏపీఎ్‌సఈ, ఆపస్, ఎస్‌ఎల్‌టీఏ, డీటీడబ్ల్యూ సంఘాల నాయకులు కలెక్టర్‌ను కలిసి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించినందుకు అభినందించారు. అనంతరం సంఘాల నేతలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సస్పెండ్ అయినవారి ఉత్తర్వులను రద్దుచేసి విదుల్లోకి తీసుకోవాలని కోరారు. బీఎల్‌ఓలకు నిబంధనల మేరకు గౌరవ వేతనం చెల్లించాలని, ఎన్నికల రెమ్యునరేషనలో అసమానతలను తొలగించాలని కోరుతూ వినతి పత్రం అందజేసారు. కార్యక్రమంలో ఏపీస్టేట్ ఎంప్లాయిస్ రాష్ట్ర అద్యక్షుడు విజయబాస్కర్, ఆపస్ జిల్లా ప్రదానకార్యదర్శి ఎర్రిస్వామి, రాష్ట్రకార్యదర్శి రాజేంద్ర, ఎస్‌ఎల్‌టీఏ జిల్లా అధ్యక్షుడు ఆదిశేషయ్య, డీటీడబ్ల్యుఏ నాయకులు వెంకటేష్, నాగరాజుపాల్గొన్నారు.