drugs మాదకద్రవ్యాలతో జీవితం నాశనం
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:39 AM
మాదకద్రవ్యాలైన మద్యం, పొగాకు, గుట్కా, గంజాయి తదితరాలను వినియోగిస్తే జీవితం నాశనమవుతుందని, ప్రతిఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని ధర్మవరం సెబ్ సీఐ గురుప్రసాద్ సూచించారు.

- ప్రతిఒక్కరూ వాటికి దూరంగా ఉండాలి
ధర్మవరంరూరల్, జూన26: మాదకద్రవ్యాలైన మద్యం, పొగాకు, గుట్కా, గంజాయి తదితరాలను వినియోగిస్తే జీవితం నాశనమవుతుందని, ప్రతిఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని ధర్మవరం సెబ్ సీఐ గురుప్రసాద్ సూచించారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సెబ్ సీఐ విద్యార్థులతో మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. చెడు అలవాట్లకు బానిసలై జీవితాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని చదువులకు పంపిస్తుంటారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయరాదని తెలిపారు. ఎవరూ చెడు అలవాట్ల జోలికి పోకుండా చదువుపై దృష్టి సారించాలని అన్నారు. అప్పుడే భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. అనంతరం మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ర్యాలీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీధర్‌బాబు, కళాశాల ప్రిన్సిపాల్ సురే్‌షబాబు, జూనియర్‌కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి, ఎనఎ్‌సఎ్‌స పోగ్రాం ఆఫీసర్ కుళ్లాయిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..