Share News

గెలుపే లక్ష్యంగా పని చేద్దాం

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:09 AM

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్‌ 11: రానున్న ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చే యాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారధి కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు.

 గెలుపే లక్ష్యంగా పని చేద్దాం

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్‌ 11: రానున్న ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చే యాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారధి కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. మం డలకేంద్రంలోని వెంకటసాయి ఐటీఐ కళాశాలలో గు రువారం వారు టీడీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ గెలు పే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పని చేయాలన్నా రు. వైసీపీ పాలనలో అన్నివ్యవస్థలను జగనరెడ్డి సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని దు య్యబట్టారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి భూదందాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయన్నారు. తా గునీటిని కూడా వదలకుండా వ్యవసాయతోటకు వదులుకున్న ఘనుడు శ్రీధర్‌రెడ్డి అని విమర్శించారు. ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పడానికి ప్ర జలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందుతుందన్నా రు. తర్వాత బీకే పార్థసారధి మాట్లాడుతూ కూటమి పార్టీల్లోని ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడి పని చేయాలని, సమష్టిగా ముందుకు సాగి కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు. అనంతరం అమడగూరు మండలంలోని జౌకలకు

చెందిన రమణమ్మ, రవిగౌడ్‌ మరో ఐదు కుటుంబాల వారు టీడీపీలో చేరారు. స మావేశంలో మండలకన్వీనర్‌ టీడీపీ మండల కన్వీనర్‌ జయచంద్ర, జడ్పీటీసీ మాజీసభ్యుడు పిట్టా ఓబులరె డ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన కృష్ణమూర్తి,మాజీ కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ శంకర్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాసులు, నాయకులు బొడ్డు జయన్న, పోగాకు జాకీర్‌, బడిశం రామాంజనేయులు, పీట్ల సుధాకర్‌, జెరిపిటి ఆంజనప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 12:09 AM