Share News

కసిగా పనిచేద్దాం: కందికుంట

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:09 AM

రానున్న 40 రోజులు నాయకులు, కార్యకర్తలు కసిగా పనిచేసి టీడీపీ విజయానికి కృషిచేద్దామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు.

కసిగా పనిచేద్దాం: కందికుంట
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌

తనకల్లు, ఏప్రిల్‌ 7: రానున్న 40 రోజులు నాయకులు, కార్యకర్తలు కసిగా పనిచేసి టీడీపీ విజయానికి కృషిచేద్దామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. మండలంలోని చీకటిమానుపల్లి నుంచి తనకల్లు కోటూరు వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కట్టకింద గంగమ్మ, తనకల్లులోని చౌడేశ్వరీ ఆలయంలో కందికుంటతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం తనకల్లులోని మండ్లిపల్లి మిట్టవద్ద ఉన్న ఎనఎంఎ్‌స ఫంక్షన హాల్‌లో టీడీపీ నాయకుడు ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కందికుంట ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అధోగతిపాలైన ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించడానికి అనుభవం కలిగిన చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యమవుతుందన్నారు. వాల్మీకి విద్యాసంస్థ అధినేత పవనకుమార్‌రెడ్డి, జనసేన బ్లూమూన విద్యాసంస్థ అధినేత శివశంకర్‌, సత్యవతి, టీడీపీ రెడ్డిశేఖర్‌రెడ్డి, దేశాయి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

రెండువందల కుటుంబాలు టీడీపీలో చేరిక: మండలంలోని చీకటిమానుపల్లి గ్రామానికి చెందినవైసీపీ సీనియర్‌ నాయకుడు నాగిరెడ్డిగారి ఈశ్వర్‌రెడ్డి ఆదివారం అతని అనుచరులు, రెండువందల కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తనకల్లు సమీపంలో ఎస్‌ఎంఎన ఫంక్షనహాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. చేరినవారిలో ఈశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ మాధవరెడ్డి, సర్పంచ రామాంజులమ్మ, కక్కల క్రిష్టప్ప, రమణప్ప, దినకర్‌నాయుడు ఉన్నారు.

గాండ్లపెంట: మండలపరిధిలోని గొడ్డివెలగల పంచాయతీలో ఆదివారం నిర్వహి ంచిన ఎన్నికల ప్రచారంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకప్రటసాద్‌ను గెలిపించాలని నాయకులను ఓటర్లను ఆభ్యర్థించారు. మండల కన్వీనర్‌ కొండయ్య ఆధ్వర్యంలో ఇంటింటికెళ్లి సూపర్‌ సిక్స్‌పథకాలపై అవగాహన కల్పించారు. క్లస్టర్‌ ఇనచార్జి ప్రసాద్‌, మాజీ వైస్‌ ఎంపీపీ కంబయ్య, దాసిరెడ్డి, ఆనంద్‌, నరసింహులు, పవన పాల్గొన్నారు.

కదిరి: తలుపుల మండలం టి.రెడ్డివారిపల్లి కాలనీలో కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ ఆదివారం విస్తృత ప్రచారం చేశారు. ప్రజలు ఆయనకు నీరాజనాలు పలికి, హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఇంటింటా సూపర్‌ సిక్స్‌పథకాల గురించి వివరించారు.

=========================

Updated Date - Apr 08 , 2024 | 12:09 AM