Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

టీడీపీని గెలిపిద్దాం.. అభివృద్ధికి బాటలు వేద్దాం

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:23 AM

టీడీపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు.

టీడీపీని గెలిపిద్దాం.. అభివృద్ధికి బాటలు వేద్దాం
ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకుంటున్న అమిలినేని సురేంద్రబాబు

నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు

కళ్యాణదుర్గం, మార్చి 3: టీడీపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శనివారం రాత్రి, ఆదివారం పలు గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ప్రజావేదిక వద్దకు తరలివచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అమిలినేని సురేంద్రబాబుకు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు విన్నవించారు. స్పందించిన ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీకి మద్దతు ఇచ్చి విజయానికి కృషి చేయాలని కోరారు. దాంతో పాటు శనివారం రాత్రి పొద్దుపోయే వరకు తనయుడు యశ్వంత చౌదరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ యువతకు భరోసా ఇచ్చారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా టీడీపీ జోరు కనిపిస్తోందని, ఈ సారి టీడీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీలోని పథకాలను ప్రజలకు వివరిస్తూ, బాబుతోనే కుటుంబ భద్రత ఉంటుందని ఇంటింటికి వెళ్లి వివరించారు.

Updated Date - Mar 04 , 2024 | 12:23 AM