Share News

వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదాం

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:12 AM

రాషా్ట్రన్ని అధోగతిపాలు చేసి భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు అన్నారు.

వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదాం
కరపత్రాలను ప్రదర్శిస్తున్న ఉమామహేశ్వరనాయుడు

టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమా

కళ్యాణదుర్గం జనవరి 4: రాషా్ట్రన్ని అధోగతిపాలు చేసి భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు అన్నారు. గురువారం కంబదూరు మండల మర్రిమాకులపల్లిలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ ఈ నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో దోపిడీ, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు కనిపిస్తున్నాయే గానీ అవినీతి పూర్తిగా శూన్యంగా మారిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఈప్రభుత్వం భూస్థాపితం కావడం ఖాయమన్నారు. అనంతరం మర్రిమాకులపల్లికు చెందిన చిన్నంపల్లి అజ్జప్ప కుమారుడు 9వ వార్డు మెంబర్‌ చిన్నంపల్లి ఈరణ్ణ ఇటీవల మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులను ఉమామహేశ్వరనాయుడు పరామర్శించారు. చంద్రన్న స్ఫూర్తితో ఉమన్న సాయం కింద రూ. 5 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. పార్టీ అండగా వుంటూ బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అభయమిచ్చారు.

మహిళాభివృద్ధే టీడీపీ ధ్యేయం

కళ్యాణదుర్గం: మహిళాభివృద్ధే టీడీపీ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి అన్నారు. గురువారం దాసంపల్లిలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

పుట్లూరు: మండలంలోని కడవకల్లు గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సుదర్శననాయుడు నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీడీపీ ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటువేసి గెలిపించాలని ఆయన కోరారు. టీడీపీ మాజీ మండల కన్వీనర్‌ శివశంకర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, గోవర్దనరాజు, సోము, పెద్దయ్య, ఆదినారాయణరెడ్డి, రామాంజనేయులు, భాస్కర్‌నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:12 AM