Share News

జగన్‌ ప్రభుత్వానికి పాడె కడదాం

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:11 AM

బీసీ ఓట్లతోనే గెలిచిన వైసీపీ ప్రభుత్వం, చివరికి వారిపైనే దాడులు చేయించిన ఘనత సైకో జగన్‌ రెడ్డికే దక్కిందని, జగన్‌ ప్రభుత్వానికి పాడె కడదామని టీడీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇనచార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు పిలుపునిచ్చారు.

జగన్‌ ప్రభుత్వానికి పాడె కడదాం
బీసీ గర్జన సభకు తరలివస్తున్న ఉమామహేశ్వర నాయుడు, టీడీపీ నాయకులు

జయహో బీసీ సభలో ఉమామహేశ్వరనాయుడు

బ్రహ్మసముద్రం, జనవరి 11: బీసీ ఓట్లతోనే గెలిచిన వైసీపీ ప్రభుత్వం, చివరికి వారిపైనే దాడులు చేయించిన ఘనత సైకో జగన్‌ రెడ్డికే దక్కిందని, జగన్‌ ప్రభుత్వానికి పాడె కడదామని టీడీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇనచార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు పిలుపునిచ్చారు. గురువారం బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో టీడీపీ మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు నేతృత్వంలో జయహో బీసీ కార్యక్రమాన్ని జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉమా మహేశ్వరనాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అండగా నిలిచిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందన్నారు. నేడు జగన్‌ రెడ్డి బీసీ పదవులను వాడుకుని తాడేపల్లి ప్యాలె్‌సను వేదికగా బీసీలపైనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. మనమందరం సమష్టిగా వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేద్దామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు నాగేశ్వరయాదవ్‌, సాధికారిక కమిటీ అధ్యక్షుడు కురుబ రమణ, కుమ్మర పోతులయ్య, బీసీ సంఘం నాయకులు లక్ష్మీ నరసింహులు, సుధాకర్‌ నాయుడు, పాలబండ్ల శ్రీరాములు, కురుగౌడ, నీలాస్వామి, తలారి సత్యప్ప, ధనుంజయ, రామరాజు, నాగరాజు, ఓబుళేసు, లోలూరు నారాయణ స్వామి, బ్యాళ్ల నాగేంద్ర, బ్యాళ్ల రాము, కురుబ చంద్రశేఖర, కుమ్మర ఓబుళపతి పాల్గొన్నారు. శెట్టూరు మండలం లింగదీర్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రామన్న బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమానికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో విషయం తెలుసుకుని బ్రహ్మసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు ఆయనను పరామర్శించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి అతని వైద్య ఖర్చుల నిమిత్తం చంద్రన్న స్ఫూర్తితో ఉమన్న ఆర్థిక సాయం కింద రూ. 5 వేలు అందజేశారు.

Updated Date - Jan 12 , 2024 | 12:11 AM