Share News

వైసీపీకి చరమగీతం పాడుదాం

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:07 AM

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడు దామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఆయన ఆదివారం హిం దూపురంలో రోజంతా బిజీ షెడ్యూల్‌తో గడిపారు

వైసీపీకి చరమగీతం పాడుదాం
బాలకృష్ణను సన్మానిస్తున్న టీడీపీలోకి చేరినవారు

కియతో జిల్లాకు ప్రపంచ గుర్తింపు

అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ

హిందూపురం, ఏప్రిల్‌ 7: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడు దామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఆయన ఆదివారం హిం దూపురంలో రోజంతా బిజీ షెడ్యూల్‌తో గడిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం లో ఉదయం జనసేన, బీజేపీ, టీడీపీ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన పలువురిని పా ర్టీలోకి కండువాలు వేసి ఆహ్వానించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించారు. జేవీఎస్‌ ఫంక్షనహాల్‌లో మూడు పార్టీల నా యకుల సమావేశంలో పాల్గొన్నారు. ఆర్‌ఎంఎస్‌ ఫంక్షనహాల్‌లో దళితుల బహిరం గ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జేవీఎస్‌ ఫంక్షనహాల్‌లో మా ట్లాడుతూ ... విభజన తరువాత రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా పరుగులు పెట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందన్నారు. అయితే ఈ ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు 30ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు. ఈ ఐదేళ్లలో ఎక్కడైనా ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందా అన్నారు. ప్రపంచంలోనే మేటి పరిశ్రమ అయిన కియ రావ డంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు ప్రపంచగుర్తింపు వచ్చిందన్నారు. కూటమి అఽధికారంలోకి వస్తే జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగ సమస్య తీరుస్తా మన్నారు. అభివృద్ధికి చంద్రబాబును బ్రాండ్‌ అంబాసిడర్‌గా వర్ణించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఉమ్మడి ఆంద్రప్రదేశ అభివృద్ధికి చంద్రబాబే మూల కారణ మన్నారు. టీడీపీ ప్రతిపాదనతోనే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి పల్లెకు తారు రోడ్డు వేసేందుకు సహరించిందన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రం లోని దారులు గతుకులమయం అని విమర్శించారు. ఒకప్పుడు హిందూపురంలో బిందె నీటి కోసం యుద్ధాలు చేసేవారని, నేడు ప్రతి ఇంటికీ నీరు వస్తోందంటే ఆ ఘనత బీజేపీ, టీడీపీకే దక్కుతుందన్నారు. మూడో సారి పోటీచేస్తున్నానని అందరూ ఆశీర్వదించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్న సమయంలో వందలాది బస్‌ షెల్టర్లు, విద్యాసంస్థలు, పురా నికి దీర్ఘకాలిక సమస్యగా ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జి ఏర్పాటు చేశామన్నారు. మరో సారి అవకాశం ఇవ్వాలన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు వరుణ్‌ మాట్లాడు తూ మూడు పార్టీల కలయిక రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే అన్నారు. కార్యక్ర మం లో టీడీపీ పట్టణాధ్యక్షుడు రమేష్‌, జనసేన నియోజకవర్గ ఇనచార్జ్‌లు ఉ మేష్‌, బీజేపీ ఆదర్శ్‌, వరప్రసాద్‌, చక్రి, చిన్నా ప్రవీణ్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

పెద్దఎత్తున టీడీపీలోకి చేరిక: రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని భావించి వైసీపీ నుంచి టీడీపీలోకి చేరినట్లు నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఆదివారం వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్దఎ త్తున చేరారు. చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ మాజీ సర్పంచ సోమశేఖర్‌తోపాటు పలువురికి బాలకృష్ణ పార్టీ కండువావేసి ఆహ్వానించారు. లేపాక్షి మండలం, హిందూపురం పట్టణం, రూరల్‌ మండలానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు. అలాగే త్రైత సిద్ధాంత కర్తలు ఎమ్మెల్యే బాలకృష్ణ చేతులమీదుగా తెలుగు క్యాలెండర్‌ను అవిష్కరించారు.

Updated Date - Apr 08 , 2024 | 12:07 AM