Share News

వైసీపీ పాలనకు చరమగీతం పాడుదాం

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:20 AM

ధర్మవరం, ఫిబ్రవరి 5: అవినీతి వైసీపీ పాలనకు ఇక చరమగీతం పాడదామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య, పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

వైసీపీ పాలనకు చరమగీతం పాడుదాం

- భవిష్యత్తుకు గ్యారెంటీలో టీడీపీ నాయకుల పిలుపు

ధర్మవరం, ఫిబ్రవరి 5: అవినీతి వైసీపీ పాలనకు ఇక చరమగీతం పాడదామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య, పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. పట్టణంలోని 40వ వార్డులో గల గుట్టకిందపల్లిలో సోమవారం వారు టీడీపీ పట్టణ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో బాబుష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి ప్రజలకు కరపత్రాలు పంచుతూ చంద్రబాబు ప్రకటించిన మినీమేనిఫెస్టో పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. వైసీపీ అఽధికారం చేపట్టి ఐదేళ్లు గడుస్తున్నా.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గుంతలు పడ్డ రోడ్లను కూడా బాగు చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ పాలనకు చరమగీతం పాడి.. టీడీపీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు భీమనేని ప్రసాద్‌నాయుడు, రాళ్లపల్లిషరీఫ్‌, అశోక్‌, మాధవరెడ్డి, గోసలశ్రీరాములు, కరెంటు ఆది, జిలకరశీన, మారుతీస్వామి, కొత్తపేట ఆది, బడిగింజల రమణ, అత్తర్‌ రహీంబాషా, పల్లపు రవీంద్ర, బీరే శీన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 12:20 AM