Share News

చంద్రబాబును మళ్లీ సీఎం చేద్దాం

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:26 AM

రాష్ర్టానికి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని, కావున అందరూ ఆయన్ను సీఎం చేయడానికి కృషి చేయాలని నియోజకవర్గ ఇనచార్జి బండారు శ్రావణీశ్రీ అన్నారు.

చంద్రబాబును మళ్లీ సీఎం చేద్దాం
పొడరాళ్లలో ప్రచారం చేస్తున్న బండారు శ్రావణీశ్రీ

బుక్కరాయసముద్రం, జనవరి 11: రాష్ర్టానికి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని, కావున అందరూ ఆయన్ను సీఎం చేయడానికి కృషి చేయాలని నియోజకవర్గ ఇనచార్జి బండారు శ్రావణీశ్రీ అన్నారు. గురువారం మండలంలోని నీలారెడ్డిపల్లి, పొడరాళ్ల గ్రామంలో బాబ ుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మిని మ్యానిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు జిల్లా ఉపాధ్యక్షుడు పసుపుల హనుమంతురెడ్డి, జీసీ బాబు, ఓబులపతి, పెద్దప్ప, జొన్నరామయ్య, రాము పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:26 AM