Share News

టీడీపీ అభ్యర్థిని గెలిపించండి

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:52 PM

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఓటర్లను ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌ అభ్యర్థించారు.

టీడీపీ అభ్యర్థిని గెలిపించండి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌

గుడిబండ, మార్చి 1: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఓటర్లను ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌ అభ్యర్థించారు. శుక్రవారం మండలంలోని రాళ్లపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున బరిలో ఉన్నానని ప్రజలు సైకిల్‌ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గె లిపించాలని కోరారు. ప్రజా సంక్షేమ అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా పది కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. చేరిన వారిలో హనుమంతరాయప్ప, నంజుండప్ప, రమేష్‌ తదితరులు ఉన్నారు. టీడీపీ నాయకుడు చంద్రశేఖర్‌ ఉన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:52 PM