education పాఠాలు సులువుగా అర్థమయ్యేలా బోధించాలి: డీఈఓ
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:29 AM
ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు సులభతరంగా అర్థమయ్యేలా బోధించేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ మీనాక్షి సూచించారు. మండలకేంద్రంలోని జిల్లా పరిషత బాలికల ఉన్నతపాఠశాలలో గురువారం జ్ఞాన ప్రకాశ రిప్రె్‌సమెంట్‌కోర్సును ప్రారంభించారు.

కొత్తచెరువు, జూన 6: ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు సులభతరంగా అర్థమయ్యేలా బోధించేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ మీనాక్షి సూచించారు. మండలకేంద్రంలోని జిల్లా పరిషత బాలికల ఉన్నతపాఠశాలలో గురువారం జ్ఞాన ప్రకాశ రిప్రె్‌సమెంట్‌కోర్సును ప్రారంభించారు.
ఈ కోర్సులో 1, 2 తరగతుల విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా ఎలా బోధించాలి, బోధనోపకారాలను ఎలా ఉపయోగించాలి, గణితం, ఆంగ్లంను సులభతరంగా ఎలా బోధించాలి, మూల్యాంకనం విధానాలను పరిచయం చేయడం వంటి అంశాల అవగాహన కల్పించారు. ఈ శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు వినియోగించుకుని విద్యార్థులకు పాఠశాలను అర్థమయ్యేవిధంగా బోధించాలని ఆమె సూచించారు. ఆర్జేడీ రాఘవరెడ్డి ఉపాధ్యాయులకు తగిన సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపాల్ రవిసాగర్, ఏఎంఓ మహేంద్రరెడ్డి, ఎంఈఓ గోపాల్‌నాయక్, ప్రదం కో ఆర్డినేటర్ శ్రీనివాసులు, రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...