Leopard died అటవీ ప్రాంతంలో చిరుత మృతి
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:47 PM
మండల కేంద్రం సమీపంలోని రామదుర్గం కొండలో చిరుత మృతి చెందినట్లు గొర్రెల కాపరులు గుర్తించారు. చిరుత కళేబరాన్ని బట్టి చూస్తే వారం రోజుల క్రితం మృతి చెంది ఉండొచ్చునని తెలుస్తోంది.

కూడేరు, జూలై 28: మండల కేంద్రం సమీపంలోని రామదుర్గం కొండలో చిరుత మృతి చెందినట్లు గొర్రెల కాపరులు గుర్తించారు. చిరుత కళేబరాన్ని బట్టి చూస్తే వారం రోజుల క్రితం మృతి చెంది ఉండొచ్చునని తెలుస్తోంది.
గత శనివారం కూడేరుకు చెందిన కొందరు గొర్రె ల కాపరులు సమీపంలోని రామదుర్గం ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా ఉన్న కొండలోకి గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. అక్కడ అడవిలో చిరుత మృతి చెందిన విష యం గుర్తించారు. ఆదివారం గ్రామంలోకి వచ్చి సన్నిహితులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..