Share News

జిల్లా విడిచి వెళ్లండి..!

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:23 AM

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీడీపీ, వైసీపీ వర్గీయులతోపాటు రౌడీషీట్లు ఉన్న పలువురిని పోలీసులు జిల్లా నుంచి బహిష్కరించారు. జాబితాను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.

జిల్లా విడిచి వెళ్లండి..!

అనంతపురం క్రైం, జూన 3: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీడీపీ, వైసీపీ వర్గీయులతోపాటు రౌడీషీట్లు ఉన్న పలువురిని పోలీసులు జిల్లా నుంచి బహిష్కరించారు. జాబితాను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వంద మందికి పైగా రౌడీషీటర్లకు సోమవారం నోటీసులు ఇచ్చారు. ఈనెల 25వరకు జిల్లాలోకి ప్రవేశించకూడదని ఆదేశించారు. అత్యధికంగా తాడిపత్రి నియోజకవర్గంలో 60 మందిని జిల్లా నుంచి బహిష్కరణ చేసినట్లు సమాచారం. అనంతపురంలో నగరంలో ముగ్గురిని బహిష్కరించారు. అనంతపురం అర్బన పరిధిలో రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన, చంద్రదండు వ్యవస్థాపకులు ప్రకా్‌షనాయుడు, రాప్తాడు నియోజకవర్గంలో టీఎనఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్‌, వైసీపీ నాయకుడు, తోపుదుర్తి ఎంపీటీసీ పాలచర్ల పోతులయ్య, తోపుదుర్తి ఓబిరెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించారు. గుంతకల్లు నియోజకవర్గంలో ఇద్దరిని బహిష్కరించారు. శ్రీసత్యసాయి జిల్లా నుంచి 35 మందిని బహిష్కరించారు. వీరిలో కదిరి నియోజకవర్గానికి చెందినవారు నలుగురు ఉన్నారు. వైసీపీ కదిరి నియోజకవర్గ ఎన్నికల ఇనచార్జి పూల శ్రీనివాసరెడ్డితో, పార్టీ నాయకుడు అల్తా్‌ఫను జిల్లా నుంచి బహిష్కరించారు. టీడీపీ కదిరి పట్టణ అధ్యక్షుడు డైమండ్‌ ఇర్ఫాన, మాజీ ఎంపీపీ విజయ్‌రెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించారు.

డీఐజీ పర్యవేక్షణలో తాడిపత్రి

తాడిపత్రి పట్టణంలో ఎన్నికల అల్లర్ల నేపథ్యంలో ఆ నియోజకవర్గంపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. డీఐజీ స్థాయి అధికారి రాహుల్‌ దేవ్‌శర్మను తాడిపత్రి నియోజకవర్గానికి ఇనచార్జ్‌గా నియమించారు. ఆయన విధుల్లో చేరి, అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

ఉదయమే వచ్చేయండి..

కౌంటింగ్‌ నేపథ్యంలో గొడవలు జరగకుండా చూసుకునేందుకు పోలీసులు తంటాలు పడుతున్నారు. ‘మంగళవారం ఉదయం ఆరు గంటలకే పోలీస్‌ స్టేషనకు వచ్చేండి. టిఫిన, భోజనం మేమే పెడతాం’ అని వివిధ పార్టీల నాయకులకు సూచించారు. ప్రతి గ్రామం నుంచి కనీసం ఇద్దరు ముఖ్య నాయకులకు ఇలాంటి సూచనలు వెళ్లాయని తెలిసింది.

శ్రీసత్యసాయి జిల్లా నుంచి 35 మంది...

పుట్టపర్తి రూరల్‌: ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా అల్లర్లకు పాల్పడ్డ వ్యక్తులను నెలరోజులపాటు జిల్లా బహిష్కరణ చేస్తూ ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలు జారీచేశారు. బహిష్కరణకు గురైన వారిలో అమరనాథరెడ్డి, ముకుందనాయుడు, బడముద్దల రంగయ్య, మహల్‌ అల్తా్‌ఫఖాన, ఏటూరి శ్రీనివాసులు, వెంకటరమణ, ఎద్దుల చంద్రశేఖర్‌రెడ్డి, పూల శ్రీనివాసులరెడ్డి, పూల విజయ్‌కుమార్‌రెడ్డి, పందిపర్తి రామకృష్ణ, మొరిమిశెట్టి సురేష్‌, జ్వాలా గణే్‌షకుమార్‌ రెడ్డి, మట్టా చంద్రశేఖర్‌, బోయ శంకర్‌, బండిరవి, మీనుగ నాగరాజు, పొట్టి నరేంద్ర, మోటా రవీంద్ర, కమ్మశివశంకర్‌, దండు ఓబులేసు, ముత్యాలప్ప, తలారి చంద్రమోహన, బోయ లక్ష్మానారాయణ, డైమండ్‌ ఇర్ఫాన, శ్రీనివాసులు, హరి చెర్లోపలి, హరిజన బాబు, కొండకమర్ల నాగేంద్ర, ఎస్‌ శివ, మదుసూదనరెడ్డి, లక్ష్మణరావు, బోయ రామాంజనేయులు, మారెప్ప, సాయికుమార్‌ ఉన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:23 AM