Share News

నేటి నుంచి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:45 PM

మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు శని వా రం నుంచి ప్రారంభం కానున్నా యి. ఈ సందర్భంగా ఆలయా న్ని విద్యుత దీపాలతో ముస్తా బు చేశారు.

నేటి నుంచి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఆలయం

రొళ్ల, మార్చి 22: మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు శని వా రం నుంచి ప్రారంభం కానున్నా యి. ఈ సందర్భంగా ఆలయా న్ని విద్యుత దీపాలతో ముస్తా బు చేశారు. ఉత్సవాలు శనివా రం ప్రారంభమై పది రోజుల పాటు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ముఖ్యంగా భూతప్ప ఉత్సవాలు అందరినీ అలరిస్తాయి. భూ తప్ప ఉత్సవాలను మూడు రోజుల ముందుగా కొండపై వెలిసిన ఉగ్రనరసింహస్వామి ధ్వజస్తంభం జ్యోతిని వెలిగిస్తారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.

ఉత్సవాలు ఇలా... మొదటి రోజు శనివారం అంకురార్పణ, ఆదివారం కలశ స్థాపన ఉంటాయి. అలాగే 25న బ్రహ్మరథోత్సవం, 26న వసంతోత్సవం, 27న గరుడోత్సవం, 28న పూలపల్లకి, 29న దేవతా కీర్తనోత్సవం జరుగుతాయి. ఈ నెల 30న భూతప్ప ఉత్సవాలు, 31న 101 దేవతలకు నైవేద్యం, ఏఫ్రిల్‌ 1న మహా మంగళారహారతి, తీర్థ ప్రసాద వినియోగం చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రవమాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - Mar 22 , 2024 | 11:45 PM