Share News

Lakshmi Narasimha swamy : సింహవాహనంపై లక్ష్మీనారసింహుడు

ABN , Publish Date - May 23 , 2024 | 12:11 AM

మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సింహ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి సింహవాహనంపై కొలువుదీర్చారు. ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ ఊరేగించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ...

Lakshmi Narasimha swamy : సింహవాహనంపై లక్ష్మీనారసింహుడు
Devotees procession the Utsavamurthys

ఉరవకొండ, మే 22: మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సింహ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి సింహవాహనంపై కొలువుదీర్చారు. ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ ఊరేగించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎస్‌ఆర్‌ కనస్ట్రక్షన్స కుటుంబసభ్యులు దాతలుగా వ్యవహరించారు. రాత్రి


చంద్రప్రభవాహనంపై స్వామి వారు దర్శనమిచ్చారు. ఆలయ చుట్టూ ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఈ కార్యక్రమానికి జల్లిపల్లికి చెందిన వెంకటరెడ్డి కుటుంబసభ్యులు ఉత్సవ ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఈవో విజయ్‌ కుమార్‌, ఆలయసిబ్బంది మారుతీ, దీపక్‌ అర్చకులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాలలో భాగంగా గురువారం గోవాహనోత్సవం, శేషవాహనోత్సవం నిర్వహించనున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 23 , 2024 | 12:11 AM