Share News

AP Elections: కూలీల ప్రచారం

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:42 PM

సార్వత్రిక ఎన్నికలు కొందరి పొట్ట నింపుతున్నాయి. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో చాలా ప్రాంతాల్లో పనులు నిలిచిపోయాయి. దీంతో రెక్క ఆడితే గాని డొక్కాడని కూలీలకు జీవనోపాధి కష్టంగా మారింది. చాల మంది పనులు లేక ఇళ్ల వద్దే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వస్తే భోజనంతో పాటు, కూలి డబ్బులు ఇస్తామని ప్రధాన పార్టీలు వారికి ఆఫర్‌ ఇచ్చాయి. ఇంకేముంది పార్టీ ఏదైతేనేమి కూలి ముఖ్యమన్నట్లుగా కూలీలంతా ఎన్నికల ప్రచారంలోకి దూకారు.

AP Elections: కూలీల ప్రచారం

సార్వత్రిక ఎన్నికలు కొందరి పొట్ట నింపుతున్నాయి. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో చాలా ప్రాంతాల్లో పనులు నిలిచిపోయాయి. దీంతో రెక్క ఆడితే గాని డొక్కాడని కూలీలకు జీవనోపాధి కష్టంగా మారింది. చాల మంది పనులు లేక ఇళ్ల వద్దే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వస్తే భోజనంతో పాటు, కూలి డబ్బులు ఇస్తామని ప్రధాన పార్టీలు వారికి ఆఫర్‌ ఇచ్చాయి. ఇంకేముంది పార్టీ ఏదైతేనేమి కూలి ముఖ్యమన్నట్లుగా కూలీలంతా ఎన్నికల ప్రచారంలోకి దూకారు. జెండాలు చేతపట్టి, కనబడ్డవారికి కరపత్రాలు ఇస్తూ కూలి ఇస్తున్న అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి నామినేషన పర్వంలో కోలాహలమంతా వీరిదే. ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు మహిళలకైతే రూ200, పురుషులకైతే రూ.500 ఇస్తున్నట్లు కూలీలు బహిరంగంగానే చెబుతున్నారు.

- మడకశిర రూరల్‌

Updated Date - Apr 24 , 2024 | 11:42 PM