Share News

ఎన్నికల వేళ ఏరులై పారుతున్న కర్ణాటక మద్యం

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:57 PM

ఎన్నికలు వస్తే చాలు గతంలో కర్ణాటక ప్రాంతం నుంచి కుప్పలు తెప్పలుగా సారా ప్యాకె ట్లు తెచ్చి ఓటర్లకు పంచేవారు. అక్కడ సారా ప్యాకెట్‌ ఒక్కోటి రూ. 5లు నుంచి రూ. 7లు వరకు ఉండేది.

ఎన్నికల వేళ ఏరులై పారుతున్న కర్ణాటక మద్యం
karnataka liquor

అప్పుడు సారా.. ఇప్పుడు టెట్రా

కళ్యాణదుర్గం, ఏప్రిల్‌ 24: ఎన్నికలు వస్తే చాలు గతంలో కర్ణాటక ప్రాంతం నుంచి కుప్పలు తెప్పలుగా సారా ప్యాకె ట్లు తెచ్చి ఓటర్లకు పంచేవారు. అక్కడ సారా ప్యాకెట్‌ ఒక్కోటి రూ. 5లు నుంచి రూ. 7లు వరకు ఉండేది. అందుకే ఓ టింగ్‌కు కొన్ని రోజుల ముందుగానే అభ్యర్థులు వాటిని తెప్పించి డంప్‌ చేసుకునేవారు. పోలింగ్‌ ముందు రోజు, లేదా పోలింగ్‌ రోజు వాటిని ఓటర్లకు పంచేవారు. ఈక్రమంలో ఆంధ్రా ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయంటే కర్ణాటకలో మద్యానికి మంచి డిమాండ్‌ ఉండేది. సరిహద్దు ప్రాంతాలైన పెద్దపల్లి, కొత్తకోట, పావగడ, టుంకూరుకు వెళ్లి ముందుగానే సారా ప్యాకెట్లు తెప్పించేవారు. అయితే మన రాష్ట్రంలో సారాను నిషేధించడంతో వాటి స్థానంలో ప్రస్తుతం టెట్రా ప్యాకెట్లు వస్తున్నాయి. కర్ణాటక నుంచి ఆంధ్ర సరిహద్దు నియోజకవర్గాలకు కుప్పలు తెప్పలుగా టెట్రా ప్యాకెట్లు తెప్పించుకుంటున్నారు. ఇక్కడి మద్యం ధరల కంటే కర్ణాటక టెట్రా ప్యాకెట్ల ధరలు తక్కువగా ఉండటమే డిమాండ్‌కు ప్రధాన కారణం. ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాల్లో టెట్రా ప్యాకెట్లు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది.

Updated Date - Apr 24 , 2024 | 11:57 PM