KALLURU: ఘనంగా కల్లూరు సుబ్బారావు జయంతి
ABN , Publish Date - May 25 , 2024 | 11:58 PM
పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు 127 జయంతి వేడుకలను శనివారం సాయంత్రం స్థానిక లలితకళాపరిషత్‌లో ఘనంగా నిర్వహించారు. తొలుత కల్లూరు సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.
అనంతపురం కల్చరల్, మే 25: పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు 127 జయంతి వేడుకలను శనివారం సాయంత్రం స్థానిక లలితకళాపరిషత్‌లో ఘనంగా నిర్వహించారు. తొలుత కల్లూరు సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం పరిషత అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పద్మజ మాట్లాడుతూ... కళారంగ అభివృద్దికి కల్లూరు సుబ్బారావు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. కళారంగం పట్ల సుబ్బారావుకు వున్న మమకారం, పరిషత్‌తో ఆయనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. అనంతరం మానవత రక్తదాతల సంస్థ వ్యవస్థాపకుడు తరిమెల అమరనాథరెడ్డికి కల్లూరు సుబ్బారావు అవార్డు అందజేసి సత్కరించారు. వినాయక నృత్యకళానిలయం చిన్నారులచే సంప్రదాయ నృత్యప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గురుప్రసాద్, ఎస్కేయూ విశ్రాంత రిజిస్ర్టార్ ఆచార్య సుధాకర్‌బాబు, పరిషత్ కార్యవర్గం రామగోవింద్‌సాగర్, అస్లాంబాషా, కుమార్, రంగస్థల కళాకారులు పాల్గొన్నారు.