Share News

సౌతజోన క్రికెట్‌ పోటీల్లో కడప, నెల్లూరు జట్ల హవా

ABN , Publish Date - May 29 , 2024 | 11:45 PM

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన సౌతజోన అండర్‌-19 వన్డే క్రికెట్‌ పోటీల్లో నెల్లూరు, కడప జట్ల వరుస విజయాలు నమోదు చేశాయి. బుధవారం రెండోరోజు స్థానిక అనంత క్రీడాగ్రామం ఆర్డీటీ స్టేడియంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన సౌతజోన అండర్‌-19 వన్డే క్రికెట్‌ పోటీలు కొనసాగాయి.

సౌతజోన క్రికెట్‌ పోటీల్లో కడప, నెల్లూరు జట్ల హవా
TAKING MANOF THE MATCH AWARD

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 29: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన సౌతజోన అండర్‌-19 వన్డే క్రికెట్‌ పోటీల్లో నెల్లూరు, కడప జట్ల వరుస విజయాలు నమోదు చేశాయి. బుధవారం రెండోరోజు స్థానిక అనంత క్రీడాగ్రామం ఆర్డీటీ స్టేడియంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన సౌతజోన అండర్‌-19 వన్డే క్రికెట్‌ పోటీలు కొనసాగాయి. కర్నూలు, నెల్లూరు జట్ల మధ్య పోటీలు జరగగా మొదట బ్యాటింగ్‌ చేసిన నెల్లూరు నిర్ణీత 50ఓవర్లలో 7 వికెట్లకు 280పరుగులు చేసింది. ఇందులో అర్జున 86పరుగులు చేసి మ్యాన ఆఫ్‌ది మ్యాచ అవార్డు అందుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన కర్నూలు 50 ఓవర్ల్లలో 5వికెట్లు కోల్పోయి 234పరుగులు చేసి ఓటమిపాలైంది.


మరో మ్యాచలో కడప, చిత్తూరు జట్లు తలపడగా మొదట బ్యాటింగ్‌ చేసిన చిత్తూరు 40.5 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. అనంతరం బరిలోకి దిగిన కడప 24ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కడప జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన బౌలర్‌ సాయిచరణ్‌ రెడ్డి మ్యాన ఆఫ్‌ది మ్యాచ అవార్డు అందుకున్నాడు. జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి మధు ఆచారి, ఫ్యామిలీక్లబ్‌ రామాంజి, మాజీ ఐపీఎల్‌ ప్లేయర్‌ విజయ్‌కుమార్‌, జిల్లా క్రికెట్‌ సంఘం జూనియర్‌ సెలెక్షన కమిటీ చైర్మన భరతరెడ్డి, శివప్రసాద్‌, కమలాకర్‌నాయుడు, కోచలు, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:45 PM