Share News

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:17 AM

అనంతపురం నగరంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం అనంతపురం అర్బన పరిధిలోని 13వ డివిజనలో టీడీపీ నాయకురాలు లక్ష్మీనాయుడమ్మ ఆధ్వర్యంలో వైసీపీ నాయకుడు బండి కాశీతోపాటు మరో 50 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
Daggubati Prasad was among those who joined in tdp party

అనంతపురం అర్బన, ఏప్రిల్‌ 24: అనంతపురం నగరంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం అనంతపురం అర్బన పరిధిలోని 13వ డివిజనలో టీడీపీ నాయకురాలు లక్ష్మీనాయుడమ్మ ఆధ్వర్యంలో వైసీపీ నాయకుడు బండి కాశీతోపాటు మరో 50 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. వీరిని దగ్గుబాటి ప్రసాద్‌ టీడీపీలోకి ఆహ్వానించారు. అలాగే నారాయణపురం గ్రామంలోని ఎఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన 60 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. కార్యక్రమంలో నాయకులు మారుతీకుమార్‌ గౌడ్‌, కురబ నారాయణస్వామి, నాగరాజు, రాజేంద్ర, షౌకత, రామకృష్ణ, ఆంజినేయులు, భార్గవ్‌ పాల్గొన్నారు.


దగ్గుబాటిని విమర్శించేస్థాయి నీకు లేదు

దగ్గుబాటి ప్రసాద్‌ను విమర్శించే స్థాయి వైసీపీ ఎస్సీ సెల్‌ నాయకులకు లేదని మాదిగ యువత రాష్ట్ర అధ్యక్షుడు మన్నల నాగార్జున ఒక ప్రకటనలో మండిపడ్డారు. దళితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఆదుకున్న ఘనత దగ్గుబాటి ప్రసాద్‌కు దక్కుతుందన్నారు. వైసీపీ పాలనలో ఆరు వేలకుపైగా దళితులపై దాడులు జరిగాయన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.


గజమాలతో సత్కారం

అనంతపురం సెంట్రల్‌: దగ్గుబాటిని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రభుకుమార్‌ గజమాలతో సత్కరించారు. బుధవారం నామినేషన సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా తెలుగుతల్లి కూడలివద్ద దగ్గు బాటిని, ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మినారాయణను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు సాయినాథ్‌ బాబు, రాజేష్‌, రాజుమహేష్‌, బాలరాజు పాల్గొన్నారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - Apr 25 , 2024 | 12:17 AM