Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

వైసీపీ నుంచి టీ డీపీలోకి చేరిక

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:28 AM

నంబులపూలకుంట, మార్చి 2: మండలకేంద్రానికి చెందిన 20 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీతీర్థం పుచ్చుకున్నారు. కదిరి పట్టణంలోని పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్‌ నివాసంలో వారు పార్టీలోకి చేరారు. వారికి కందికుంట కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

వైసీపీ నుంచి టీ డీపీలోకి చేరిక

నంబులపూలకుంట, మార్చి 2: మండలకేంద్రానికి చెందిన 20 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీతీర్థం పుచ్చుకున్నారు. కదిరి పట్టణంలోని పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్‌ నివాసంలో వారు పార్టీలోకి చేరారు. వారికి కందికుంట కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్ట పడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. చేరిన వారిలో ఖాదర్‌వలీ, అమానుల్లా, ముబారక్‌, బాబ్‌జాన, రఘునాథ రెడ్డి, చాంద్‌బాషా, చిన్న ఆంజనేయులు, లోకేష్‌; షబ్బానా, మసూద్‌, వెంకటరమణ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పవనకుమార్‌, దండే రవి, పాలగిరి బాషా, అజంతుల్లా, దండే గంగశేఖర్‌, రాహూల్‌బాబా, బీసీ సెల్‌ రవి ఉన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 12:28 AM