Share News

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:35 AM

నియోజకవర్గ అభివృద్ధి కోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేస్తున్న కృషిని గుర్తించి టీడీపీలో చేరినట్లు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు తెలిపారు. మండల కేంద్రంలో ఆదివా రం టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు సమక్షంలో పలువురు మైనార్టీ లు, బీసీ వర్గాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి సాదరంగా అహ్వానించారు.

 వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక
Minorities who left YCP and joined TDP

చిలమత్తూరు, ఏప్రిల్‌ 21: నియోజకవర్గ అభివృద్ధి కోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేస్తున్న కృషిని గుర్తించి టీడీపీలో చేరినట్లు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు తెలిపారు. మండల కేంద్రంలో ఆదివా రం టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు సమక్షంలో పలువురు మైనార్టీ లు, బీసీ వర్గాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.


వారికి శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి సాదరంగా అహ్వానించారు. ఈ ఎన్నికల్లో బాలకృష్ణను అత్యఽధిక మెజార్టీతో గెలిపించుకుంటామని పార్టీలోకి చేరిన వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బేవనహళ్లి ఆనంద్‌, నాగరాజుయాదవ్‌, రంగారెడ్డి, సోమశేఖర్‌, బేకరీ గంగాధర్‌, నందీషప్ప, ఆశ్వత్థప్ప తదితరులు పాల్గొన్నారు.


నేటి నుంచి బాలయ్య ప్రచారం

హిందూపురం, ఏప్రిల్‌ 21: మూడోసారి టీడీపీ కూటమి హిం దూపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం నుంచి ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు. ఎన్నికల ప్రచారానికి సోమవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. మండలంలోని పులమతిలో ఉదయం 8గంటలకు ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. అక్కడి నుంచి మానెం పల్లి శిరివరం పంచాయతీలో ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం కంచిసముద్రం, మైదుగోళం, కోడిపల్లిలో ప్రచారం సాగనుంది. అదేవిధంగా మంగళవారం కల్లూరు, నాయనపల్లి, కొండూరు, పంచాయతీలు, సాయంత్రం మల్లిరెడ్డిపల్లి, చోళసముద్రం, బిసలమానేపల్లి, లేపాక్షి పంచాయతీల్లో ప్రచారంలో పాల్గొంటారు. హిందూపురం మండలంలోని బాలంపల్లి, చలివెందుల, బీరేపల్లి, కగ్గల్లు పంచాయతీల్లో ఈనెల 24న ప్రచారం చేయనున్నారు. సాయంత్రం మలుగూరు, మణేసముద్రం, పూలకుంటలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ వార్తల కోసం...

Updated Date - Apr 22 , 2024 | 12:35 AM