Share News

జనసేన పార్టీ రాయలసీమ రీజినల్‌ ఉమెన కో-ఆర్డినేటర్‌ శ్రీలత

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:09 AM

రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది వ డ్డెర్ల ను సీఎం జగ నరెడ్డి నమ్మించి నట్టే ట ముంచారని జన సేన పార్టీ రాయ ల సీమ రీజినల్‌ ఉమెన కో-ఆర్డినేటర్‌ పెండ్యాల శ్రీలత ధ్వజమెత్తారు.

జనసేన పార్టీ రాయలసీమ రీజినల్‌ ఉమెన కో-ఆర్డినేటర్‌ శ్రీలత
వడ్డెర్లను నట్టేట ముంచిన సీఎం జగనరెడ్డి

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జనవరి 8: రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది వ డ్డెర్ల ను సీఎం జగ నరెడ్డి నమ్మించి నట్టే ట ముంచారని జన సేన పార్టీ రాయ ల సీమ రీజినల్‌ ఉమెన కో-ఆర్డినేటర్‌ పెండ్యాల శ్రీలత ధ్వజమెత్తారు. సోమ వారం ఆమె ఆ పార్టీ కార్యాయలంలో ఆమె మాట్లాడుతూ.. వడ్డెర్లను దామాషా క్రారం రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ ఎస్టీ జాబితాలోకి చేర్చాలని హామీ ఇచ్చిన జగనరెడ్డి అధికారంలోకి రాగానే తీరని అన్యాయం చేశాడని మండిప డ్డారు. ఇసుక కొరత, భవన నిర్మాణం దెబ్బతిని వడ్డెర్ల కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రాష్ట్రంలో దాపురించాయన్నారు. అనంతరం పలువురు వడ్డెర కులస్థులు సమస్యల వినతి పత్రాన్ని పెండ్యాల శ్రీలతకు అందజేశారు. సమస్యలను అధినేత పవనకళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్తామని శ్రీలత అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్డే సురేష్‌, ఉపాధ్యక్షులు నాగేశ్వర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగుల ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు పీట్ల ఆనంద్‌, సలహాదారులు మల్లెల కాశీం, సాకే నాగరాజు, సంపతకుమార్‌, మహేష్‌, రామాంజనేయులు, కుంచపు లక్ష్మన్న, గోగుల వెంకటనారాయణ, కుమార్‌, ఎర్రిస్వామి, వంశీ, రామకృష్ణ, వీర మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:09 AM