Share News

జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభం

ABN , Publish Date - Jul 19 , 2024 | 12:19 AM

స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞ కార్యక్రమాన్ని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి గురువారం ప్రారంభించారు.

జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభం
సభ్యత్వ నమోదును ప్రారంభిస్తున్న చిలకం

ధర్మవరం, జూలై 18: స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞ కార్యక్రమాన్ని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జనసేన అధినేత పవనకల్యాణ్‌ ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన నాల్గవ విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమా న్ని దిగ్విజయం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరు సభ్యులుగా భాగస్వాములై మిగిలిన వారితో కూడా సభ్యత్వ నమోదు చేయించాలన్నారు. ఈ సభ్యత్వం చేయించుకోవడం వల్ల రూ.5 లక్షలు ప్రమాద జీవిత బీమా సౌకర్యం, ప్రమాద భీమా రూ.50 వేలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బెస్త శ్రీనివాసులు, అడ్డగిరి శ్యాంకుమార్‌, వెంకటరెడ్డి, బాలక్రిష్ణ, రామాంజి పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2024 | 12:19 AM