Share News

జనసేన, టీడీపీ గెలుపే లక్ష్యం

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:16 AM

ఎన్నికల్లో బలిజలు పెద్దన్న పాత్ర పోషించాలని జనసేన, టీడీపీ, కాపు సంక్షేమసేన, బలిజ సంఘం నేతలు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో కాపులంతా ఏకమై గళం వినిపించాలన్నారు. ఆదివారం స్థానిక గుత్తిరోడ్డులోని ద్వారకా చలమారెడ్డి కన్వెన్షన హాల్‌లో కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో బలిజల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

జనసేన, టీడీపీ గెలుపే లక్ష్యం
జనసేన రాష్ట్ర నేతలతో టౌనబ్యాంకు చైర్మన జేఎల్‌ మురళీధర్‌, టీడీపీ నాయకులు

ఎన్నికల్లో బలిజలు పెద్దన్నపాత్ర పోషించాలి

జనసేన, టీడీపీ, కాపు సంక్షేమసేన, బలిజ సంఘం నేతల పిలుపు

బలిజల ఆత్మీయ కలయిక

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జనవరి 7: ఎన్నికల్లో బలిజలు పెద్దన్న పాత్ర పోషించాలని జనసేన, టీడీపీ, కాపు సంక్షేమసేన, బలిజ సంఘం నేతలు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో కాపులంతా ఏకమై గళం వినిపించాలన్నారు. ఆదివారం స్థానిక గుత్తిరోడ్డులోని ద్వారకా చలమారెడ్డి కన్వెన్షన హాల్‌లో కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో బలిజల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు, పొలిటికల్‌ ప్రొటోకాల్‌ చైర్మన తిరుమలరావు (బాబి), జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌, జనసేన కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి భవానీ రవికుమార్‌ హాజరయ్యారు. జనసేన రాష్ట్ర నేత ఆమంచి స్వాములు మాట్లాడుతూ... రాబోవు ఎన్నికల్లో కాపులంతా ఏకతాటిపైకి వచ్చి చట్టసభల్లో కాపు గళం వినిపించేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాయలసీమలో అనేకమంది కాపులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారన్నారు. వీరిలో రాజకీయ చైతన్యం తెచ్చేందుకు కాపు సంక్షేమసేన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ మాట్లాడుతూ... జనసేన, టీడీపీ పొత్తును బలపరిచి రానున్న ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిద్దామన్నారు. భవాని రవికుమార్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో విజయానికి జనసేన నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి, కొత్త ప్రభుత్వాన్ని స్థాపించాలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గాజుల ఆదెన్న మాట్లాడుతూ కాపుల ఐక్యత కోసం నిరంతరం కాపు సంక్షేమసేన పనిచేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలకు కాపు సంక్షేమసేన సహకారం అందిస్తుందని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో కాపు సంక్షేమసేన జిల్లా అధ్యక్షుడు కాశెట్టి సంజీవరాయుడు, టౌనబ్యాంకు చైర్మన జేఎల్‌ మురళీధర్‌, టీడీపీ కాపు కార్పొరేషన మాజీ డైరెక్టర్‌ రాయల్‌ మురళి, బలిజ సంఘం నాయకులు కూరగాయల లక్ష్మీపతి, టీడీపీ మాజీ జడ్పీటీసీ మేకల వేణుగోపాల్‌, టీడీపీ నాయకులు దండు శీన్రివాసులు, కొప్పల మీనాక్షమ్మ స్వచ్ఛంద సంస్థ అధినేత రవికాంత రమణ, టౌన బ్యాంకు డైరెక్టర్లు సుంకర రమేష్‌, రొళ్ల భాస్కర్‌, జనసేన నాయకులు గ్రంధి దివాకర్‌, పేరూరు శ్రీనివాసులు, వెన్నెల కృష్ణ, వెంకటనారాయణ, పత్తి చంద్రశేఖర్‌, ఆకుల ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 01:16 AM