Share News

JAGJIVAN RAM: ప్రజాపాలనకు దార్శనికుడు జగ్జీవనరామ్‌

ABN , Publish Date - Jul 06 , 2024 | 11:40 PM

కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ జగ్జీవనరామ్‌ ప్రజాపాలన దార్శనికుడని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు కొనియాడారు. శనివారం జగ్జీవనరామ్‌ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ, తెలుగుయువత, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు.

JAGJIVAN RAM: ప్రజాపాలనకు దార్శనికుడు జగ్జీవనరామ్‌
MS Raju garlanding the statue of Jagjivana Ram

అనంతపురం సెంట్రల్‌, జూలై 6: కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ జగ్జీవనరామ్‌ ప్రజాపాలన దార్శనికుడని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు కొనియాడారు. శనివారం జగ్జీవనరామ్‌ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ, తెలుగుయువత, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రజలకు తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. తెలుగుయువత వెంకటప్ప, లక్ష్మీనారాయణ, ఎస్సీ,ఎస్టీ సంఘా జేఏసీ అధ్యక్షుడు సాకే హరి, వెంకటప్ప, రామాంజనేయులు, సుంకన్న, వన్నూరప్ప, నాగరాజు, ఓబులేసు, ఆదినారాయణ, రుషివర్ధన, నాగరాజు, జాంబవంతుడు పాల్గొన్నారు.


టీడీపీ ఆధ్వర్యంలో...

అనంతపురం అర్బన: స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ బాబు జగ్జీవనరామ్‌కు టీడీపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. జగ్జీవన రామ్‌ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం స్థానిక అంబేడ్కర్‌ నగర్‌లోని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు వెంకటేష్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు నరసింహ, నాయకులు ఉమర్‌ ముక్తియార్‌, రాజేష్‌, చంద్రశేఖర్‌, శేఖర్‌, అమర్‌, శివ, శ్రీనివాసులు పాల్గొన్నారు.

నార్పల: నార్పల క్రాసింగ్‌ వద్ద నున్న ఎమ్మార్పీఎస్‌ కార్యాలయంలో ఆ సంఘం శింగనమల నియోజకవర్గ ఇనచార్జి రంగాపురం పుల్లప్ప ఆధ్వర్యంలో బాబు జగ్జీవన రామ్‌ వర్ధంతిని శనివారం నిర్వహించారు. నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు ఎస్వీ రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మేకలరాజు, నాయకులు ఏపీ కుళ్లాయప్ప, నార్పల జయన్న, తుంపెర రమణయ్య, నారాయణ, కేశేపల్లిధన, నారాయణ, కట్టెల రామాంజి, నార్పల లక్ష్మన్న, చిన్నకోట్ల శ్రీరాములు, తుంపెర రామాంజి, తుంపెర మోహన పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2024 | 11:40 PM