Share News

జగన నియంత పాలనకు స్వస్తిచెప్పాలి

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:28 AM

అసెంబీల్లో తిరుగులేని ఆధీక్యత ఇచ్చిన ప్రజలకు జగన దూరంగా ఉంటూ నియంతన పాలన సాగిస్తున్నారని టీడీపీ కూటమి పెనుకొం డ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత విమర్శించారు.

జగన నియంత పాలనకు స్వస్తిచెప్పాలి
గంగంపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న సవిత

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత

గోరంట్ల, ఏప్రిల్‌ 4: అసెంబీల్లో తిరుగులేని ఆధీక్యత ఇచ్చిన ప్రజలకు జగన దూరంగా ఉంటూ నియంతన పాలన సాగిస్తున్నారని టీడీపీ కూటమి పెనుకొం డ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత విమర్శించారు. సమస్యలపై ప్రశిస్తే వారిపై దౌర్జాన్యా లు, పోలీసులు కేసులు పెట్టిస్తున్నారని, అటువంటి వైసీపీని ఎన్నికల్లో భూస్థాపి తం చేయాలని పిలుపునిచ్చారు. ఆమె గురువారం గోరంట్ల మండలంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గంగంపల్లి పంచాయతీ గ్రామాల్లో ప్రచారం ని ర్వహించారు. మందుగా గోపీదేవరపల్లి ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజ లు చేసి, ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికెళ్లి టీడీపీ అధికారంలోకి వచ్చే అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. ఆదర్శ విద్యాసంస్థల అధినేత పెద్దరాసు సుబ్రహ్మణ్యం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వనరులను దోచుకుంటున్నవారికి బుద్ధి చె ప్పాలని కోరారు. ఈకార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ సోముశేఖర్‌, కొత్తపల్లి నరసింహప్ప, అశ్వత్థరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నిమ్మల చంద్రశేఖర్‌, నిమ్మల శ్రీధర్‌, వృషభా నీలకంఠారెడ్డి, సుబ్రహణ్యం, జనసేన సురేష్‌, సంతోష్‌, వెంకటేష్‌, స్థానిక నాయకులు టైలర్‌ రుద్ర, రామస్వామి, సక్రెనాయక్‌, రవీంద్రారెడ్డి నాగేంద్ర, రాజా, వెంకటశివ, మోహన, రమేష్‌, సూరి హరిదత్తు, దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలోకి పది కుటుంబాలు

పెనుకొండ టౌన : పరిగి మండం జంగాలపల్లికి చెందిన పది కుటుంబాలు గురువారం టీడీపీలోకి చేరాయి. పార్టీ స్థానిక కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి సవిత కండువాలు పార్టీలోకి ఆహ్వానించారు. వారిలో యానిమే టర్‌ రమేష్‌, సన్నాయప్ప, రంగస్వామి, బాబు, గంగప్ప, శివన్న, జయప్ప, జూలప్ప, సుధాకర్‌, వెంకటరెడ్డి, తదితరులు చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మరోఐదేళ్లు వైసీపీ వస్తే రాష్ట్రం సర్వనాశనం కావడం ఖాయమన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:28 AM